కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు(Waqf Amendment) Bill) ఆమోదం లభించింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) సమావేశమైంది. ఈ సమావేశంలో విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ ఛైర్మన్ జగదాంబిక పాల్ తెలిపారు. క్లాజుల వారీగా ఓటింగ్‌లో 16 మంది ఎంపీలు సవరణలకు అనుకూలంగా ఓటు వేయగా.. 10 మంది ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం 44 నిబంధనలతో సవరణ బిల్లు 16:10 మెజారిటీతో నెగ్గింది.
కాగా కమిటీలో ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా.. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 28న ముసాయిదా నివేదిక సిద్ధం అవ్వగా.. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నారు. అయితే వక్ఫ్ సవరణ బిల్లుని గతేడాది ఆగస్టు 8న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది.