Homeనేషనల్Resignation : తమిళనాడు బీజేపీకి షాక్.. పార్టీని వీడిన అన్నామలై! కొత్త ప్రస్థానానికి సిద్ధమైన మాజీ...

Resignation : తమిళనాడు బీజేపీకి షాక్.. పార్టీని వీడిన అన్నామలై! కొత్త ప్రస్థానానికి సిద్ధమైన మాజీ అధ్యక్షుడు!

Annamalai resignation from BJP : తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా, దక్షిణాదిలో కమలం వికసించేందుకు అహర్నిశలు శ్రమించిన కె.అన్నామలై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్ది కాలానికే, ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ వర్గాలను నివ్వెరపరిచారు. ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి, రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఈ ‘సింగం’.. ఇప్పుడు బీజేపీకి ఎందుకు దూరమయ్యారు? తన ఐదు పేజీల లేఖలో అమిత్ షాకు ఏం వివరించారు? 

- Advertisement -

రాజీనామా ఆమోదం: ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన : అన్నామలై పంపిన రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ధ్రువీకరించారు. గత మూడు రోజులుగా ఊగిసలాటలో ఉన్న ఈ ప్రక్రియ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదంతో ముగిసింది.

ఐదు పేజీల లేఖలో ఆంతర్యం: అన్నామలై తన రాజీనామాతో పాటు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఐదు పేజీల సుదీర్ఘ లేఖను పంపారు. ఇందులో పార్టీలో తనకు ఎదురైన పరిస్థితులు, తమిళనాడులో పార్టీ భవిష్యత్తుపై తనకున్న భిన్నాభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ‘నివురు గప్పిన నిప్పు’లా ఉన్న అసంతృప్తి ఈ లేఖ ద్వారా బహిర్గతమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యక్తిగత ప్రస్థానం vs పార్టీ సిద్ధాంతం: రాష్ట్రంలో ‘ఎన్ మన్, ఎన్ మక్కల్’ (నా భూమి, నా ప్రజలు) పాదయాత్ర ద్వారా అన్నామలై భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, ద్రవిడ గడ్డపై సొంత ఇమేజ్‌తో ఎదగాలని ఆయన ఆకాంక్షించడం, జాతీయ నాయకత్వ వ్యూహాలతో విభేదించడమే ఈ రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది. రాజీనామా ప్రకటించిన వెంటనే అన్నామలై తదుపరి కార్యాచరణపై జోరుగా చర్చ సాగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన తమిళనాడులో ఒక కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించే యోచనలో ఉన్నారు. బీజేపీ ముద్ర లేకుండా, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ‘క్లీన్ పాలిటిక్స్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

తమిళనాట కమలం పరిస్థితి ఏమిటి : అన్నామలై రాజీనామా బీజేపీకి గట్టి దెబ్బేనని చెప్పాలి. రాష్ట్రంలో పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర మరవలేనిది. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో, తమిళనాడులో బీజేపీ పగ్గాలు ఎవరు చేపడతారు? అన్నామలై సొంత పార్టీ పెడితే అది ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News