మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న భారీ బహిరంగ సభ నిర్వహించాలను బీఆర్ ఎస్ పార్టీ నిర్ణయించింది. బీఆర్ ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన కీలకనేతలు పాల్గొననున్నారు. కాగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహారాష్ట్ర నేతలతో కలిసి ఆయన సభాస్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సభ స్థలం ఎంపిక, బహిరంగ సభకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి జీవన్ రెడ్డి స్థానిక నేతలతో చర్చించారు.
దేశానికి బీజేపీ శాపం.. బీఆర్ ఎస్సే ఆశాదీపం
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. దేశానికి బీజేపీ శాపంలా మారిందని, లక్షల కోట్ల రూపాయల విలువ గలా ప్రభుత్వ రంగ ఆస్తులను అదానీ వంటి వారికి దోచిపెడుతోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ ఎస్సే దేశానికి ఆశాదీపమని, ప్రజల ఆకాంక్షలు తీర్చకలిగిన మనసున్న మహానేత కేసీఆర్ గారేనని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ ఎస్ లక్ష్యమని, ఆదర్శవంతమైన తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశమంతా అమలు చేయాలన్నదే కేసీఆర్ గారి కృతనిశ్చయమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నాందేడ్ సభ పెద్ద ఎత్తున విజయవంతమై భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారి, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిషన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం ప్రవీణ్, శివాన్క్, అంకిత్ యాదవ్, గణేష్ బాబు రావు కదం తదితరులు పాల్గొన్నారు.
Kandar Loha: 26న మహారాష్ట్రలో కేసీఆర్ భారీ సభ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES