Kangana: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ తన స్పష్టమైన మాటలతో, ధైర్యమైన ఆలోచనలతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు కూడా తొలిసారి పీరియడ్స్ వచ్చినప్పటి అనుభవం గురించి మాట్లాడారు. కౌమార దశలో అమ్మాయిలకు తొలిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు భయం, ఆందోళన, అయోమయం కలగడం సాధారణం. కాగా.. ఇటీవల ‘హౌటర్ ఫ్లై’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తొలి పీరియడ్స్ అనుభవాన్ని పంచుకున్నారు. అది తనను ఎలా భయపెట్టిందో ఆమె వివరించారు.
Read Also: Delhi: కారుతో ఢీకొట్టి.. 600 మీటర్లు ఈడ్చకెళ్లిన ఘటన.. బాలుడు అరెస్టు
తొలి పీరియడ్స్ అనుభవం: తల్లి ఆందోళన
కంగనా మాట్లాడుతూ.. “మా స్కూల్‌లో నేను తొమ్మిదో తరగతికి వచ్చేసరికి, నా తోటి స్నేహితురాళ్లందరికీ పీరియడ్స్ వచ్చేశాయి. కానీ నాకు మాత్రం రాలేదు. దీంతో మా అమ్మ చాలా ఆందోళన పడేది. నన్ను అడిగినప్పుడు, నాకు ఇంకా రాలేదని చెప్పేదాన్ని” అని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా, ఆ రోజుల్లో తాను ఇంకా బొమ్మలతో ఆడుకునేదాన్నని.. ఒక రోజు ఆ బొమ్మలను చూసి తన తల్లి విసుగు చెందినట్లు పేర్కొన్నారు. ‘పీరియడ్స్ రావడం లేదు, పైగా ఇంకా బొమ్మలాటలా?’ అని కోపంగా తనపై ఆమె తల్లి అరిచినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన బొమ్మలన్నింటినీ తీసుకుని విసిరేసి.. ‘అందుకే పీరియడ్స్ రావడం లేదు’ అని అందని పేర్కొన్నారు. ఒక రోజు తప్పకుండా పీరియడ్స్ వస్తాయి, అలా వచ్చినప్పుడు తనకు చెప్పాలని తన తల్లి పదే పదే చెప్పిందని కంగనా తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
Read Also: Viral: సంచలనం సృష్టించిన చైనా యువతి భరతనాట్యం
రక్తాన్ని చూసి భయపడిపోయాను: కంగనా
కంగనా తనకు తొలిసారి పీరియడ్స్ వచ్చిన రోజును వివరిస్తూ.. అది చాలా భయానకమైన, షాకింగ్ అనుభవం అని చెప్పారు. నిద్ర లేచి చూస్తే, బెడ్‌షీట్ అంతా రక్తంతో నిండి ఉందని.. తాను చాలా భయపడిపోయానని చెప్పుకొచ్చారు. ఈ సంఘటన ప్రతి నెల జరుగుతుందని నమ్మలేకపోయానని.. ఏడుపొచ్చేసిందని గుర్తుచేసుకున్నారు. అయితే, అప్పుడు తన తల్లి సంతోషపడినా.. తాను మాత్రం చాలా భయపడినట్లు పేర్కొన్నారు. “ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అని నేను పదే పదే ఆలోచించాను” అని ఆమె పేర్కొన్నారు. ఆ క్షణం తాను బలహీనంగా, తన ప్రపంచం అకస్మాత్తుగా మారిపోయినట్లు అనిపించిందని ఆమె అన్నారు. “నాన్న ఇక నన్ను ప్రేమించరేమో, అమ్మ కౌగిలించుకోదేమో అనిపించింది. ఒక్క రాత్రిలోనే ఎంతగానో మారిపోయింది” అని కంగనా భావోద్వేగంగా చెప్పారు. అంతేకాకుండా, సాంప్రదాయాల కఠిన నిబంధనలు గ్రామాల్లో పీరియడ్స్ సమయంలో పాటించే పద్ధతుల గురించి కూడా కంగనా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “మా అమ్మ నా తర్వాతి తరానికి మంచి జరగాలని, నాకు బట్టలకు బదులుగా శానిటరీ ప్యాడ్‌లు ఇచ్చేవారు. అయితే, ఇంట్లో మాత్రం పాత సాంప్రదాయ నిబంధనలు పాటించేవాళ్లం. ఆ రోజుల్లో నన్ను వంటగదిలోకి, గుడిలోకి అనుమతించేవారు కాదు” అని తెలిపారు.


