Ranya Rao Smuggling: కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష పడింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెకు ఈ శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఇది ఆమె కెరీర్‌లో ఒకప్పుడు ఆశాజనకంగా ఉండేది. తన పార్టనర్ తరుణ్ పేరుతో దుబాయ్‌లో ఓ వజ్రాల కంపెనీ పెట్టారని.. దాన్ని ఉపయోగించుకొని దేశమంతా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే హీరోయిన్ రన్యా రావు కదలికలపై నిఘా పెట్టిన అధికారులు ఇటీవలే రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వెంటనే ఆమెను అరెస్టు చేసి దర్యాప్తుకు పంపించారు.
అయితే బంగారం స్మగ్లింగ్ చేసేందుకు నటి రన్యా రావు అనేక రకాల దార్లు వెతుక్కున్నట్లు తెలుస్తోంది. తమ మారు తండ్రితో పాటు ఓ ఐపీఎస్ అధికారి ఇన్‌ఫ్లూయన్స్ ఉపయోగించి.. ఎయిర్‌పోర్టులో చెకింగ్ తప్పించుకోవాలని చూసింది. ఈ క్రమంలో తనకున్న వీఐపీ హోదాను దుర్వినియోగం చేస్తూ.. ఆమె తాజాగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ విషయంలో కర్ణాటకలోని కొంతమంది కాంగ్రెస్ మంత్రులు జోక్యం చేసుకున్నారని తెలిసింది. ఆమెకు బెయిల్ రావడానికి విశ్వప్రయత్నాలు చేశారట. కానీ, ఆమెకి వ్యతిరేకంగా పక్కా ఆధారాలను దర్యాప్తు అధికారులు సమర్పించడం వల్ల ఆమెకు బెయిల్ రాలేదని తెలుస్తోంది.
కన్నడ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ గా పేరొందిన రన్యా రావు.. తొలినాళ్లలో విపరీతమైన ఆఫర్లు వచ్చాయి. అయితే నటనలో ఉంటూనే ఎక్కువ డబ్బు కోసం ఆమె ఈ స్మగ్లింగ్ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆమె చేసిన ఈ పని వల్ల పేరుప్రఖ్యాతలు పోవడమే కాకుండా.. ఆమెకు సినిమాల్లో అవకాశాలే రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. అయితే ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఎంతమంది ఉన్నారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


