Sunday, November 16, 2025
Homeనేషనల్Gold Smuggling Case: నటి రన్యా రావుకు రూ. 102 కోట్ల జరిమానా

Gold Smuggling Case: నటి రన్యా రావుకు రూ. 102 కోట్ల జరిమానా

Kannada Actress Ranya Rao Fined ₹102 Crore: బెంగళూరులో భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) భారీ జరిమానా విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా డీఆర్‌ఐ భారీగా ఫైన్ విధించింది.

- Advertisement -

ALSO READ: India Immigration Act 2025 : విదేశీయులపై కేంద్రం కొరడా.. నేర చరిత్ర ఉంటే భారత్లోకి నో ఎంట్రీ!

మంగళవారం డీఆర్‌ఐ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, కన్నడ నటి రన్యా రావుకు రూ. 102 కోట్లు జరిమానా విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హోటల్ యజమాని తరుణ్ కొండరాజుకు రూ. 63 కోట్లు, ఆభరణాల వ్యాపారులైన సాహిల్ సకారియా జైన్ మరియు భరత్ కుమార్ జైన్‌లకు ఒక్కొక్కరికి రూ. 56 కోట్లు జరిమానా విధించింది.

మంగళవారం నాడు డీఆర్‌ఐ అధికారులు బెంగళూరు సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితులందరికీ 250 పేజీల నోటీసుతో పాటు 2,500 పేజీల అనుబంధ పత్రాలను అందించారు. “సహాయక పత్రాలతో కూడిన ఒక వివరణాత్మక నోటీసును తయారు చేయడం చాలా శ్రమతో కూడిన పని. మేము ఈ రోజు నిందితులకు 11,000 పేజీల పత్రాలను అందించాం” అని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి.

ALSO READ: Patient Meals: ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ప్రత్యేక పోషకాహారం

డీఆర్‌ఐ వర్గాల ప్రకారం, గత మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యా రావును అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద సుమారు 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, రన్యా రావు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అధికారి కే. రామచంద్ర రావు సవతి కూతురు అని సమాచారం.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న రన్యా రావుకు ఈ ఏడాది జులైలో కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ (COFEPOSA) చట్టం కింద ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. COFEPOSA చట్టానికి సంబంధించిన ఈ కేసు విచారణ మంగళవారం హైకోర్టులో జరిగింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.

ALSO READ: Modi : మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్ర స్పందన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad