Kanpur : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ దొంగ తన నటనతో డాక్టర్ ను బురిడీ కొట్టించాడు. మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి రోగిలా నటిస్తూ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఐఫోన్‌ను చాకచక్యంగా దొంగిలించాడు. అసలు ఏం జరిగిందంటే, మహ్మద్ ఫయాజ్ చేతిలో కర్ర, ప్రిస్క్రిప్షన్ పట్టుకుని కుంటుకుంటూ నడుస్తూ ఆసుపత్రి కారిడార్‌లో మాట్లాడుకుంటున్న ఇద్దరు మహిళా వైద్యుల పక్కనుంచి వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఓ వైద్యురాలి తెల్లకోటు జేబులోని ఐఫోన్‌ను చాకచక్యంగా ఎత్తేశాడు.
#कानपुर हैलट हॉस्पिटल में मोबाइल चोरी की वारदात..
दिव्यांग मरीज बनकर जूनियर डॉक्टर का चुराया मोबाइल,सीसीटीवी कैमरे में कैद हुई पूरी घटना,स्वरूप नगर पुलिस ने आरोपी चोर को किया गिरफ्तार,स्वरूप नगर थाना क्षेत्र का मामला.#kanpur #CCTV #CHORI #SIRFSUCH pic.twitter.com/ASaEsHakPl
— ठाkur Ankit Singh (@liveankitknp) August 24, 2025
ఫయాజ్ కుంటుతూ ఆసుపత్రి నుంచి బయటకు పరుగెత్తాడు. కాసేపటికి తన ఫోన్ కనిపించకపోవడంతో వైద్యురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఫయాజ్ చేష్టలను గుర్తించారు. గంటలోపలే గాలింపు చర్యలు చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. విచారణలో ఫయాజ్ గతంలో కూడా ఇలాంటి దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALSO READ: Ysrcp : జగన్‌కు గుడ్ న్యూస్.. చేతులు కలిపిన కీలక నేతలు
ఈ సంఘటనలో సీసీటీవీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషించాయి. పోలీసుల స్పీడ్ రెస్పాన్స్ తో పాటు వైద్యురాలి వివరణ సైతం సరైన సమయంలో దొంగను పట్టించాయి.


