కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మార్కును దాటి ఘన విజయం సాధించింది. దీంతో మరోసారి కర్నాటక పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ప్రతి ఐదేళ్లకోమారు సర్కారును మార్చే కన్నడిగులు ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. గత 38 ఏళ్లుగా ఇక్కడ రూలింగ్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కాక తప్పటం లేదు. అయితే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ ముందస్తు సన్నాహాలు భారీగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించేసింది. ఇందుకు అవసరమైన సాయాన్ని డీఎంకే సర్కారుతో కాంగ్రెస్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు మాజీ సీఎం సిద్ధరామయ్యకు పట్టం కడతారా లేక కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ కు పగ్గాలు అప్పగిస్తారన్న అన్న విషయం అధికారికంగా తేలాల్సి ఉంది. మరోవైపు సుమారు 44.4 శాతం ఓట్ షేర్ ను కాంగ్రెస్ సొంతం చేసుకున్నట్టు ఎర్లీ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. 118 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా బీజేపీ సుమారు 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జేడీఎస్ 25 సీట్లతో సాగుతోంది.
Karnataka Assembly elections: కర్నాటక కాంగ్రెస్ వశం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES