పనిచేసే మహిళల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, సమ్మిళిత (inclusive), సహాయకారి (supportive) వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ చొరవ రుతుస్రావ ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, మహిళా ఉద్యోగులకు శారీరక, మానసిక సౌకర్యాన్ని కల్పిస్తుందని కేబినెట్ నోట్ పేర్కొంది.
ALSO READ: CJI BR Gavai: ‘మర్చిపోయిన అధ్యాయం’.. దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ
రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ కేబినెట్ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, ఈ చర్య ఉద్యోగినులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. “ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైంది. అందుకే దీన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాము,” అని ఆయన తెలిపారు.
ఈ నిర్ణయంతో, కర్ణాటక రాష్ట్రం బిహార్, ఒడిశా, కేరళ, సిక్కిం వంటి వేతనంతో కూడిన రుతుస్రావ సెలవు నిబంధనలను అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో చేరింది. పాలసీ లేకపోయినా, జొమాటో, స్విగ్గీ, బైజూస్ వంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే ఈ సెలవును అమలు చేస్తున్నాయి. మహిళల ఆరోగ్య అవసరాలను గుర్తించే దిశగా ఇది ప్రశంసనీయమైన ముందడుగు అని మహిళా హక్కుల కార్యకర్త బృందా ఆదిగే ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.


