Homeనేషనల్Resign : కన్నడ కోటలో కలకలం.. కుర్చీ దిగిన సిద్ధరామయ్య, కాబోయే సీఎం డీకే!

Resign : కన్నడ కోటలో కలకలం.. కుర్చీ దిగిన సిద్ధరామయ్య, కాబోయే సీఎం డీకే!

Karnataka CM Siddaramaiah resignation : కన్నడ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయేందుకు సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలకు తలొగ్గి తన పదవికి లాంఛనంగా రాజీనామా చేశారు. అయితే, ఆయన తన రాజీనామా లేఖను సమర్పించే క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

- Advertisement -

అధిష్ఠానం ఆదేశమే శిరోధార్యం (హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి..) : గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పుపై జోరుగా చర్చ సాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉదయం తన అధికారిక నివాసంలో క్యాబినెట్ మంత్రులతో నిర్వహించిన అల్పాహార విందు సమావేశంలో ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. “పార్టీ అధిష్ఠానం సూచన మేరకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నాను. తన తర్వాత పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు” అని ఆయన తన సహచర మంత్రులకు స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉన్న డీకే శివకుమార్‌‌కు సీఎం పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన పవర్-షేరింగ్ ఒప్పందాన్ని నిలబెట్టుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

లోక్‌భవన్‌లో అనూహ్య అవాంతరం : రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం, సిద్ధరామయ్య తన క్యాబినెట్ సహచరులు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఇతర కీలక నేతలతో కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు బెంగళూరులోని లోక్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే అక్కడ వారికి ఓ ఊహించని అవాంతరం ఎదురైంది. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన తన స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ (మరియు వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబై) వెళ్లినట్లు లోక్‌భవన్ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఆయన రాజీనామా లేఖను లోక్‌భవన్ కార్యదర్శికి అందజేశారు.

సాంకేతిక కారణాలతో బ్రేక్.. రాత్రి 7.30కు మరోసారి : గవర్నర్ భౌతికంగా అందుబాటులో లేకపోవడం, రాజ్యాంగపరమైన నిబంధనల ప్రకారం ఆయన స్వయంగా రాజీనామాను ఆమోదించాల్సి ఉండటం వంటి సాంకేతిక కారణాలను ఉటంకిస్తూ, లోక్‌భవన్ సిబ్బంది రాజీనామా ప్రక్రియను వెంటనే పూర్తి చేయలేకపోయారు. ఈ సాంకేతిక చిక్కుల నేపథ్యంలో సిద్ధరామయ్య కాసేపు వేచిచూడాల్సి వచ్చింది. అయితే, ఈ రోజు సాయంత్రానికే గవర్నర్ తిరిగి రానుండటంతో, రాత్రి సరిగ్గా 7.30 గంటలకు సిద్ధరామయ్య మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లి లాంఛనంగా తన రాజీనామాను స్వయంగా గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ పరిణామాలతో కన్నడ నాట రాజకీయ చదరంగం ఉత్కంఠభరితంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News