Homeనేషనల్RCB Stampede: బెంగళూరు తొక్కిసలాట కేసు.. ఐపీఎస్‌ అధికారులకు క్లీన్‌ చిట్‌

RCB Stampede: బెంగళూరు తొక్కిసలాట కేసు.. ఐపీఎస్‌ అధికారులకు క్లీన్‌ చిట్‌

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో అప్పటి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి. దయానందతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొనసాగుతున్న శాఖాపరమైన విచారణను ముగిస్తూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చింది.

- Advertisement -

తొక్కిసలాట.. 11 మంది మృతి
కాగా గతేడాది జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ విజేత నిలిచిన సందర్భంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిమితికి మించి స్టేడియంకు హాజరవ్వడం.. అక్కడ కోహ్లితో ఇతర ఆటగాళ్లను చూసి అభిమానులు అత్యుత్సాహం చూపించారు. ఈ క్రమవంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోగా భారీగా ప్రాణనష్టం వాటిల్లింది.

ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణ చర్యలు చేపట్టి బాధ్యత వహించాల్సిన అధికారులుగా భావిస్తూ కమిషనర్ బి. దయానంద అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ వికాస్, డీసీపీ (సెంట్రల్) శేఖర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే అనంతరం సంబంధిత అధికారులు సమర్పించిన వివరణలు వివిధ పరిపాలనా శాఖల నివేదికలు అభిప్రాయాలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా వారి మీద కొనసాగుతున్న శాఖాపరమైన విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Hansika Morwani: పెళ్లి, విడాకులు.. విమర్శలపై ఘాటుగా స్పందించిన హన్సిక

ఆర్‌సీబీదే ప్రధాన బాధ్యత
ఇదిలా ఉండగా. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆర్‌సీబీ యాజమాన్యానిదే ప్రధాన బాధ్యత అని పేర్కొంది. అవసరమైన అనుమతులు లేకుండానే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం, భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించడంలో విఫలమవడం వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావించింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇతర కోణాల్లో విచారణ మాత్రం కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News