Karnataka: ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే కర్ణాటకలోని ఓ స్కూల్ హాస్టల్ లో తొమ్మిదో తరగతి విద్యార్థిని శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. ఇకపోతే, గత మూడేళ్లలో ఏకంగా 80,813 టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ఓ నివేదిక వెల్లడించింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు ఇంటర్నెట్ ప్రభావం, కుటుంబ అస్థిరత ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇలాంటి విస్తృత ధోరణి ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.
Read Also: Assembly: అసెంబ్లీ సమావేశాల వేళ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
అత్యధికంగా బెంగళూరు అర్బన్ లో..
కర్ణాటక ఆరోగ్యశాఖ ప్రకారం.. బెంగళూరు అర్బన్‌లో అత్యధికంగా 8,891 టీనేజ్ గర్భాలు నమోదయ్యాయి. బెలగావిలో 8,169, విజయపుర 6,229 టీనేజ్ గర్భాలు రికార్డ్ అయ్యాయి. ఉడిపి సహా దక్షిణ కన్నడ జిల్లాల్లో గత మూడేళ్లుగా అత్యల్పంగా మైనర్ గర్భాలు నమోదవుతుండగా.. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో దాదాపు 2,000 గర్భాలు నమోదైన ప్రాంతాలలో ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా, అత్యధికంగా 18-19 సంవత్సరాల వయస్సు వారికి ప్రెగ్నెన్సీ వచ్చింది. 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల 276 మంది ప్రెగ్నెంట్ అయ్యారు. 2023-2024 నుండి 15-16 వయసున్న 786 మంది ప్రెగ్నంట్ కాగా.. 16-17 వయసున్న 2,397 మంది గర్భం దాల్చారు. 17-18 వయసున్న 11,136 మంది ప్రెగ్నెంట్ అయ్యారు.
Read Also: The Hundred: హండ్రెడ్ లీగ్ లో 11 బౌండరీలతో జేసన్ రాయ్ బీభత్సం
ఆరోగ్య మంత్రి..
ఇకపోతే, కర్ణాటకలో పెరుగుతున్న టీనేజ్ గర్భాల పట్ల ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోగ్యం, విద్య, మహిళా శిశు అభివృద్ధితో సహా ఏడు కీలక విభాగాలను సమన్వయం చేయడానికి కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీ నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను కూడా అమలు చేసింది. అంతేకాకుండా, 24/7 చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను బలోపేతం చేసింది. అంతేకాకుండా, చిన్నారుల కోసం అక్కా ఫోర్స్ ను ప్రారంభించినట్లు మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అసెంబ్లీలో తెలిపారు.


