Saturday, November 15, 2025
Homeనేషనల్DK vs Siddu Row in Karnataka: సిద్దు వర్సెస్ డీకే వర్గీయుల మాటల యుద్ధం

DK vs Siddu Row in Karnataka: సిద్దు వర్సెస్ డీకే వర్గీయుల మాటల యుద్ధం

Kartnataka Congress: క‌ర్ణాట‌క‌ అధికార పార్టీ కాంగ్రెస్‌లో మరోసారి ముసలం మొదలైంది. ప‌ద‌వుల పంచాయితీ మ‌ళ్లీ తెరమీదకొచ్చింది. అధికారంలోకి రాగానే సీఎం ప‌ద‌వి కోసం డీకే శివ‌కుమార్ , సీఎం సిద్ధరామ‌య్య త‌ల‌ప‌డ‌గా ఆ పదవి సిద్ధరామయ్యను వరించింది. అయితే కొన్నాళ్ల క్రితం అదే సీఎం పదవి కోసం మరోసారి రచ్చ చోటు చేసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి ప‌ద‌వి కోసం కాంగ్రెస్‌లో కుమ్ములాట‌లు జోరందుకున్నాయి. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యని తప్పించి ఆ స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టాలంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం ఢిల్లీ పెద్దల దాకా వెళ్లింది. అయినా దీనికి ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

- Advertisement -

దీనికితోడు డీకే, సిద్ధరామయ్య వర్గీయులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తెరతీశారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు టాక్ వినిపిస్తుంది. మాజీ మంత్రి కేఎన్‌ రాజన్న బీజేపీలో చేరబోతున్నారంటూ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ ఇటీవలే వెల్లడించారు. రాజన్న రాష్ట్ర సహకార మంత్రిగా పని చేశారు. పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై వ్యతిరేక గళం వినిపించడంతో.. ఆయన్ని వెంటనే గత నెలలో పదవి నుంచి తప్పించారు.

ఈ నేపథ్యంలో తన తండ్రి పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాజన్న తనయుడు, ఎమ్మెల్సీ, రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరే వారిలో బాలకృష్ణ ఉన్నారంటూ ఆరోపించారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత (డీకే శివకుమార్‌ను ఉద్దేశించి‌) వెంట వెళ్లబోతున్నారంటూ మండిపడ్డారు. తన తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ డీకే పేరును ప్రస్తావించకుండానే అటాక్ చేశారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని వాపోయారు. తన తండ్రి పదవి పోవడం వెనుక రహస్య హస్తం ఉందంటూ ఆరోపణలు పోరక్షంగా డీకే, ఆయన వర్గీయులపై విరుచుపడ్డారు. ఇలా సిద్ధరామయ్య, డీకే వర్గీయులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి పొలిటికల్ నిప్పు రాజుకుంది.

గతంలో డీకే శివకుమార్ సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. డీకే అనుచరగణం సైతం డీకేనే కాబోయే సీఎం అంటూ ఆయనకు బాహాటంగా మద్దతు పలికారు. దీంతో పంచాయతీ ఢిల్లీ పెద్దల వద్దకు చేరింది. ఏఐసీసీ పెద్దలు డీకే, సిద్దూలను ఇద్దరినీ పిలిచి మాట్లాడి సర్ది చెప్పాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad