Karnataka MLA’s Shocking Remark: కర్ణాటకలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి గురించి ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్‌కు ఎమ్మెల్యే ఆర్.వి. దేశ్‌పాండే ఇచ్చిన సమాధానం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా గర్భిణులకు ఆసుపత్రి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని జర్నలిస్ట్ అడిగితే, దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి.
ఉత్తర కన్నడ జిల్లాలోని హలియల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఆర్.వి. దేశ్‌పాండేను ఒక మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించింది. జోయిడా తాలూకాలో ఆసుపత్రి లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు, ముఖ్యంగా గర్భిణులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ఆసుపత్రి నిర్మిస్తారని ఆమె అడిగింది.
ALSO READ: PM Modi : భారత్ పరుగులు… 7.8% వృద్ధితో దూసుకెళ్తున్నామని ప్రధాని మోదీ ధీమా!
దీనికి సమాధానంగా దేశ్‌పాండే నవ్వుతూ, “మీకు ఆసుపత్రి అవసరం లేదు, మీ డెలివరీ పక్కనే ఉన్న హలియల్‌లో చేయిస్తాం, చింతించకండి” అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విన్న జర్నలిస్ట్ ఆశ్చర్యపోయి “ఏం సార్?” అని అడిగింది. అప్పుడు దేశ్‌పాండే చుట్టూ ఉన్నవారి వైపు చూస్తూ కన్ను కొట్టి, “మీకు డెలివరీ సమయం వచ్చినప్పుడు మేమే చూసుకుంటాం” అని అన్నారు.
ఆయన సమాధానంపై జర్నలిస్ట్ స్పందిస్తూ, “సార్, ఈ ప్రాంత ప్రజలకు ఆసుపత్రి చాలా అవసరం. దయచేసి ఈ టర్మ్‌లోనే నిర్మించండి” అని విజ్ఞప్తి చేసింది. దీనికి ఎమ్మెల్యే “సరే” అని మాత్రమే బదులిచ్చారు.
ALSO READ: PM Modi: దేవతల కంటే తల్లి గొప్పది.. అమ్మను అలా అనడం బాధించింది!
దేశ్‌పాండే చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ప్రతినిధి విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకుల చవకబారు మనస్తత్వాన్ని, నైతిక దివాళాకోరుతనాన్ని సూచిస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రేమ, గౌరవం గురించి మాట్లాడుతుంటే, ఆయన నాయకులు ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు” అని విమర్శించారు.
ఉత్తర కన్నడలో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఆసుపత్రి కోసం గతంలో #NoHospitalNoVote అనే సోషల్ మీడియా ఉద్యమం కూడా ప్రారంభించారు. అత్యవసర చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం ఈ ప్రాంత ప్రజలు తరచుగా మంగళూరు, ఉడుపి వంటి ఇతర జిల్లాలకు ప్రయాణించాల్సి వస్తుంది.
ALSO READ: Patient Meals: ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ప్రత్యేక పోషకాహారం


