తాను బీజేపీలో చేరతానంటూ వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు కిచ్చా సుదీప్. తాను బీజేపీలో చేరటం లేదని, పోటీ కూడా చేయట్లేదన్న సుదీప్.. కేవలం బీజేపీ తరపున ప్రచారం మాత్రం చేస్తానంటూ సీఎం బొమ్మై సమక్షంలో ప్రకటన చేయటం విశేషం. తన కష్టకాలంలో సీఎం బొమ్మై అండగా నిలిచి సాయం చేశారన్న హీరో సుదీప్ తాను బొమ్మైకి ఎప్పుడూ మద్దతుగా ఉంటానన్నారు. సీఎం బొమ్మై తనకు గాడ్ ఫాదర్ అని అందుకే తాను మామా అని పిలుస్తానంటూ వెల్లడించి షాక్ ఇచ్చారు. ఇదే విషయంపై మరింత స్పష్టత ఇచ్చిన బొమ్మై సుదీప్ ఏ పార్టీకి చెందరంటూ వివరణ ఇచ్చారు. సుదీప్ ను బెదిరిస్తూ టేప్స్ లీక్ చేస్తానన్న వారెవరూ తనకు తెలుసునని వారికి తగిన బుద్ధి చెబుతానంటూ సీఎం పేర్కొనటం విశేషం.
Karnataka: పార్టీలో చేరట్లే, పోటీనూ చేయట్లే..జస్ట్ ప్రచారం చేస్తా..క్లారిటీ ఇచ్చిన హీరో
సంబంధిత వార్తలు | RELATED ARTICLES