Saturday, July 12, 2025
Homeనేషనల్Karnataka RTO Scam: ట్యాక్స్ తప్పించుకోవడం కోసం లగ్జరీ కార్ల ఓనర్ల కొత్త పంథా!

Karnataka RTO Scam: ట్యాక్స్ తప్పించుకోవడం కోసం లగ్జరీ కార్ల ఓనర్ల కొత్త పంథా!

RTO Scam Exposed in Karnataka: కర్ణాటకలో లగ్జరీ కార్ల యజమానులు రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించకుండా తప్పించుకుంటున్న ఓ కొత్త తరహా మోసం బయటపడింది. ప్రభుత్వ అధికారుల సహాయంతో లగ్జరీ కార్లకు చెల్లించాల్సిన కోట్ల రూపాయలు చెల్లించకుండా తప్పించుకున్నారు. ఈ ఉదంతం దక్షిణ కన్నడ రవాణా శాఖలో చోటుచేసుకుంది. ఈ తరహా కుంభకోణంలో దాదాపు కోట్ల రూపాయలు పన్ను చెల్లించకుండా వాహనదారులు తప్పించుకున్నారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. 

పలు మీడియాల్లో వస్తున్న కథనాల ప్రకారం కొందరు రవాణా అధికారులు ఈ దందాకు సహకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఓ సెకండ్‌ హ్యాండ్‌ కారుని సేల్‌ చేస్తుండగా ఈ కుంభకోణం బయటపడింది. సుమారు రూ.2.5 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63 కారుకి బదులు ఓ వ్యక్తి కేవలం రూ. 50 లక్షలు విలువచేసే మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఏ 200 పేరుతో వెహికిల్‌ని రిజిస్టర్‌ చేసుకున్నాడు. అయితే ఇంజిన్ మరియు ఛాసిస్ నంబర్లు ఏఎంజీ జీ63కి సంబంధించినవి కాగా.. ట్యాక్స్‌ ఆదా చేయడానికి కారు మోడల్ నంబర్‌ని అధికారిక రికార్డులలో చాకచక్యంగా మార్చినట్లు తేలింది.

అధికారుల జేబుల్లోకి: రోడ్ ట్యాక్స్ తప్పించుకోవడంలో భాగంగా కొందరు వ్యక్తులు ఇలాంటి మార్పులు చేస్తూ వాహనాలను రిజిస్ట్రర్ చేయిస్తున్నారు. మంగళూరుకు చెందిన నిహాల్ అహ్మద్ 2017లో కొనుగోలు చేసిన ఈ ఎస్‌యూవీ సరైన పర్మినెంట్ నంబర్ లేకుండా ఎనిమిదేళ్ల పాటు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పైనే తిరుగుతున్నాడు. అయితే ఇదే కారుని 2025లో ఈ కారును మంగళూరుకే చెందిన నీరజ్ శర్మకు విక్రయించాడు. రీసేల్ సమయంలో మోడల్ ఉద్దేశపూర్వకంగా రికార్డులో మార్చినట్లు గుర్తించాడు దీని కారణంగా రూ .20–22 లక్షల పన్నును తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

ట్యాక్స్‌ని తప్పించుకోవడం కోసం మంగళూరు రవాణా శాఖ అధికారులతో రికార్డులను తారుమారు చేసినట్లు తెలిసింది. మైసూరులో లగ్జరీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అవకతవకలను గుర్తించిన అధికారులు ప్రస్తుతానికి ఈ ఎస్‌యూవీని సీజ్ చేశారు. దీంతో వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)ను బ్లాక్ లిస్టులో పెట్టారు. అంతేకాకుండా శివమొగ్గ ప్రాంతీయ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇలాంటి అవినీతి కుంభకోణాలు రాష్ట్ర ఖజానాకు భారీ ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. దీంతో ఇందులో భాగం అయిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన నిబంధనలు తీసుకువస్తామని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News