Thursday, March 12, 2026
Homeనేషనల్Toronto Death:కెనడాలో ఘోరం: షాపింగ్ మాల్ పార్కింగ్‌లో బెంగళూరు టెక్కీ దారుణ హత్య

Toronto Death:కెనడాలో ఘోరం: షాపింగ్ మాల్ పార్కింగ్‌లో బెంగళూరు టెక్కీ దారుణ హత్య

Bengaluru Techie: కెనడాలోని టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో కర్ణాటకకు చెందిన 37 ఏళ్ల భారతీయ టెక్కీ చందన్ కుమార్ రాజా నందకుమార్ దారుణంగా హత్యకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం రద్దీగా ఉండే షాపింగ్ మాల్ పార్కింగ్ ఏరియాలో పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగళ సమీపంలోని త్యామగొండ్లు గ్రామానికి చెందిన చందన్.. గత ఆరేళ్లుగా కెనడాలో నివసిస్తూ ‘ఎల్‌టీఐ మైండ్‌ట్రీ’ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

- Advertisement -

టొరంటోలోని వుడ్‌బైన్ షాపింగ్ సెంటర్ సమీపంలో చందన్ తన SUV కారులో కూర్చుని ఉండగా.. గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. కారు అద్దాలను చీల్చుకుంటూ బుల్లెట్లు చందన్ శరీరంలోకి దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని పోలీసులు వెల్లడించారు. నిందితులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఇది ప్లాన్ ప్రకారమే చేసిన టార్గెటెడ్ దాడి అని పోలీసులు భావిస్తున్నారు.

also read Infinix Note 60 Pro: యూత్ టార్గెట్‌గా అదిరిపోయే లుక్.. గేమింగ్ బీస్ట్‌లా రాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో

ఈ వార్త చందన్ స్వగ్రామమైన త్యామగొండ్లులో తీరని విషాదాన్ని నింపింది. చందన్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. గత శుక్రవారమే కొడుకుతో మాట్లాడామని.. ఈ వేసవిలో సెలవుపై ఇంటికి వస్తానని చెప్పాడని తండ్రి నందకుమార్ కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గతంలోనే ఇండియాకు వచ్చేయమని కోరినప్పటికీ.. పని ఒత్తిడి వల్ల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడని, మా మాట విని ఉంటే ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

చందన్ హత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, టొరంటోలో కన్నడ సంఘం ఏర్పాటులో చందన్ క్రియాశీలకంగా వ్యవహరించాడని.. ఆ కోణంలో ఏమైనా గొడవలు జరిగాయా అనే అనుమానాన్ని బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ.. ఒక కన్నడిగుడిని కోల్పోవడం బాధాకరమని, చందన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సాయం కోరామని తెలిపారు. ఇది టొరంటోలో ఈ ఏడాది జరిగిన 3వ హత్య కావడంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News