Friday, February 13, 2026
Homeనేషనల్Suzani cap : కశ్మీరీ 'సుజానీ' టోపీకి ప్రపంచ ఖ్యాతి.. చేతి కళకు జై కొడుతున్న...

Suzani cap : కశ్మీరీ ‘సుజానీ’ టోపీకి ప్రపంచ ఖ్యాతి.. చేతి కళకు జై కొడుతున్న దేశవిదేశాలు!

Kashmiri Suzani cap demand : కశ్మీర్ అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటారు.. అక్కడి హస్తకళల గొప్పతనం చెప్పడానికి మాటలు చాలవు. శాలువాలు, కార్పెట్ల తర్వాత, ఇప్పుడు మరో సంప్రదాయ కళాఖండం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అదే ‘సుజానీ టోపీ’. సున్నితమైన సూది పనితనంతో, కశ్మీరీ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ టోపీలు, ఇప్పుడు యువత నుంచి వృద్ధుల వరకు అందరి మన్ననలూ పొందుతున్నాయి. అసలు ఏమిటీ సుజానీ టోపీ ప్రత్యేకత? దీనికి ఎందుకింత గిరాకీ?

- Advertisement -

కశ్మీరీ పురుషులు గౌరవానికి చిహ్నంగా టోపీ ధరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే, ఆధునిక పోకడలతో సాధారణ టోపీలకు ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో, శ్రీనగర్‌లోని కొందరు కళాకారులు, కశ్మీర్‌కే ప్రత్యేకమైన ‘సుజానీ’ ఎంబ్రాయిడరీని టోపీలపై అద్ది, వాటికి కొత్త జీవం పోశారు.

ఏమిటీ ‘సుజానీ’ ప్రత్యేకత : సుజానీ అనేది కేవలం ఎంబ్రాయిడరీ కాదు, అదొక అద్భుతమైన కళ.ఈ టోపీలపై చేసే ఎంబ్రాయిడరీ మొత్తం చేతితోనే, అత్యంత సున్నితంగా చేస్తారు. పూలు, ఆకులు, సంప్రదాయ కశ్మీరీ ఆకృతులతో ప్రతి టోపీని ఓ కళాఖండంలా తీర్చిదిద్దుతారు. సాధారణంగా షాల్స్‌పై చేసే ఈ ఎంబ్రాయిడరీని, పాష్మినా వంటి విలువైన, మృదువైన వస్త్రంపై చేయడం వల్ల, ఈ టోపీలు ఎంతో సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

కొన్నేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా సుజానీ టోపీల తయారీ ప్రారంభించాం. మొదట కొన్ని మాత్రమే చేశాం. అవి చేతిచేతికి అమ్ముడుపోయి, విపరీతమైన ఆదరణ పొందాయి. ఇప్పుడు దేశవిదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.”
– ఫయ్యాజ్ అహ్మద్, రియాజ్ అహ్మద్ షా, టోపీ తయారీదారులు

పెరుగుతున్న గిరాకీ.. రూ.20 వేల వరకు ధర : ఒకప్పుడు కేవలం హజ్, ఉమ్రా వంటి యాత్రలకు వెళ్లేవారే ఈ టోపీలను కొనుగోలు చేసేవారు. కానీ, ఇప్పుడు సాధారణ రోజుల్లో, పండుగలకు కూడా యువత, వృద్ధులు వీటిని ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. సాధారణ టోపీలతో పోలిస్తే, వీటి తయారీకి నెలల సమయం పడుతుంది. అందుకే, వీటి ధర రూ.1,500 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది.

నాణ్యతే ముఖ్యం: “మేం నాణ్యత విషయంలో రాజీ పడం. అందుకే, ఒకసారి కొన్నవారు, మళ్లీ తమ స్నేహితులను, బంధువులను కూడా తీసుకొస్తారు,” అని మరో వ్యాపారి అద్నాన్ తెలిపారు. ఈ సుజానీ టోపీలు, కశ్మీర్ లోయలోని కళాకారుల అద్భుత నైపుణ్యానికి, వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News