ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ఆందోళనకు దిగారు. కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచితంగా మాట్లాడటంపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు.
ఇటు హైదరాబాద్ లోనూ బండి సంజయ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగి, నిరసనలకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆద్వర్యం లో పంజాగుట్ట చౌరస్తా లో ధర్నా, దిష్టి బొమ్మ దగ్ధం అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వంటి కార్యక్రమాలు జోరుగా సాగాయి.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు సీఎం కుమార్తెకు అండగా నిలుస్తూ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నారు. కవితమ్మా … ధైర్యంగా ఉండండి అంటూ మంత్రి వేముల చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా? కేసిఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం,ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాము.. ఉంటము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి ట్వీట్ చేశారు.