Sunday, July 7, 2024
Homeనేషనల్Kavitha Press meet: రాజస్థాన్ లో ఆదానితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేస్తుంది...

Kavitha Press meet: రాజస్థాన్ లో ఆదానితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేస్తుంది నిజం కాదా ?

లడ్డాక్ లో ఆదానిని విమర్శించిన రాహుల్.... రాజస్థాన్ లో విమర్శించగలరా?

అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లడ్డాఖ్ కు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదానిని విమర్శించారని, మరి అదే విమర్శలను రాజస్థాన్ లో చేయగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆదానితో కలిసి ప్రాజెక్టులు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు.

- Advertisement -

చతిస్గడ్ లో ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఆదివాసుల ఆందోళన తీవ్రతరం చేయడంతో ఆదానితో ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం నిజం కాదా అని అడిగారు. గురువారం రోజున నిజామాబాదులో మీడియా ప్రతినిధులతో కవిత ఇష్టా గోస్ట్ గా మాట్లాడారు. డిక్లరేషన్ల పేరిట తెలంగాణలో హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో ఎందుకు వాటిని అమలు చేయలేదని అడిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను కనీసం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయిన అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టడం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ సమావేశం కోసం వస్తున్న నాయకులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వీకరించి అమలు చేస్తుందని అన్నారు. కాబట్టి తెలంగాణ అభివృద్ధిని అధ్యయనం చేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎజెండాగా పెట్టుకోవాలని అన్నారు. తమ పార్టీ ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొట్టి కాంగ్రెస్ హామీలు ఇస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేలా ఏమి చేయడం లేని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పరిపాలించడానికి 60 ఏళ్ల పాటు ప్రజలు సమయం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. రెండు కోట్ల ఉద్యోగాల కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు కోసం దీక్ష చేయాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సూచించారు. కిషన్ రెడ్డి దీక్ష చేయాల్సింది హైదరాబాదులో కాదని, ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ నివాసం ముందు దీక్ష చేయాలని అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలతో ప్రైవేటు రంగంలో 35 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ నేనని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News