Saturday, November 23, 2024
Homeనేషనల్KCR @ Nanded:  రైతులు ఎప్పుడూ పోరాటం ఎందుకు చేయాలి ?

KCR @ Nanded:  రైతులు ఎప్పుడూ పోరాటం ఎందుకు చేయాలి ?

దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్‌ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో సమస్యలు పరిష్కారం కాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నదేశాలైన సింగపూర్‌, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయని మెచ్చుకున్నారు.

- Advertisement -

మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక సమస్యలను పరిస్కరించుకున్నామని, కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తున్నామని, మహారాష్ట్రలో పలుచోట్ల వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దుస్థితి ఉందని సీఎం గుర్తుచేశారు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్నదని, రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.

దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకని నిలదీశారు. దేశమంతటా ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. దేశ రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదని చెప్పారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News