Thursday, November 21, 2024
Homeనేషనల్BRS-AAP: కేజ్రీవాల్.. కేసీఆర్ కలిస్తే బీజేపీని ఎదుర్కోగలరా?

BRS-AAP: కేజ్రీవాల్.. కేసీఆర్ కలిస్తే బీజేపీని ఎదుర్కోగలరా?

- Advertisement -

BRS-AAP: తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని మూసేసి.. బీఆర్ఎస్ పార్టీతో గులాబీ జెండా ఊపేసి జాతీయ రాజకీయాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన కేసీఆర్.. ముందుగా మహారాష్ట్ర నుండి రాజకీయం మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. యాంటీ బీజేపీ ప్రధాన ఎజెండాగా మొదలైన కేసీఆర్ ఈ ప్రయాణం ఉత్తరాది రాజకీయాలలో సక్సెస్ అవుతుందా? అన్న చర్చలు సహజంగానే వస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే యాంటీ బీజేపీ ఎజెండాతో ఢిల్లీతో పాటు పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకున్న కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దేశమంతా విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. మోడీ కంచుకోట గుజరాత్ లోనూ సత్తా చాటుకుని 6 శాతం ఓట్లు సంపాదించుకున్న ఆప్ 5 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకున్నారు. మిగతా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలని చూస్తున్న ఆప్ ఎక్కడ, ఎలాంటి ఛాన్స్ వచ్చినా అందిపుచ్చుకొని దూసుకొస్తున్నారు.

ఒకవైపు ఆప్ ఉత్తరాదిన మూడవ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంటే ఇప్పుడు కేసీఆర్ జాతీయ ఎజెండాతో మరో ప్రత్యామ్నాయం కావాలని ఆశపడుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయాలలో చర్చ జరుగుతుంది. నిజానికి కేసీఆర్ బీఆర్ఎస్ ఉత్తరాదిన ఎమెర్జ్ కావడం కష్టమైనపనే. కాగా దక్షిణదిలో మాత్రం కొంతమేర ప్రయోజనం ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అలాంటపుడు దక్షణాది నుండి కేసీఆర్, ఉత్తరాది నుండి కేజ్రీవాల్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందనే చర్చలు కూడా సాగిపోతున్నాయి.

బీఆర్ఎస్-ఆప్ కలిసి సాగితే దేశంలో మూడవ బలమైన శక్తిగా మారే ఛాన్స్ ఉందని.. ఇప్పటికే ఈ రెండు వర్గాల నుండి సానుకూల సంకేతాలు కూడా వచ్చాయని రాజకీయ వర్గాలలో ఓ బోగట్టా. అయితే.. ఇద్దరూ కలిసినా మోడీ-షాల బీజేపీని ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ.. ఆప్ అలాగే ప్రయత్నిస్తే పోయేదేముందని ముందుకెళ్లి కొన్ని చోట్ల సక్సెస్ అయింది. మరి.. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి బీజేపీ కోట బద్దలు కొడతారా? వీళ్ళకి దేశవ్యాప్తంగా మిగతా పార్టీల నుండి ఎంతమేర సహకారం ఉంటుందన్నది ముందు ముందు భారత రాజకీయాలలో ఆసక్తికరమైన అంశాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News