ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సౌరశక్తి ప్రాజెక్టులో పెట్టుబడిదారులను భారీగా మోసగించారని ఆయనతోపాటు మరో 8 మందిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. మార్కెట్లో అదానీ గ్రూప్స్ (Adani Groups) షేర్స్ వాల్యూ భారీగా పడిపోయింది.
అంతేకాదు అదానీ సంస్థలకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్స్ (Adani Groups) సంస్థతో కెన్యా ప్రతిపాదిత ఒప్పందాలను రద్దు చేసుకుంది. 700 మిలియన్ డాలర్ల డీల్‌ని రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియమ్ రుటో వెల్లడించారు. దేశంలోని దర్యాప్తు సంస్థలు, భాగస్వామ్య దేశాలు అందించిన కొత్త సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విలియం రూటో తెలిపారు.