PM Narendra Modi: ప్రస్తుతం సౌత్ రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ కొనసాగుతుంది. తమిళనాడు, తిరువంతపురం రాష్ట్రాలకు ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీ అధిష్టానాలు సైతం ప్రచారంలో భాగం అవుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం (ఏప్రిల్ 4) ప్రధానీ మోదీ కేరళలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. క్రైస్తవులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
కేరళ రోడ్ల పరిస్థితి దారుణం
ఇవాళ కేరళంలోని తురువల్లలో ఎన్నికల ప్రచారంలోమాట్లాడుతూ.. గోవాలో క్రైస్తవ సమాజం నిర్ణయాత్మక శక్తిగా ఉందన్నారు. అక్కడ ఎన్టీయే ప్రభుత్వం నిరంతరం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కేరళలో కూడా ఎన్డీయే ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతుందని హామీ ఇచ్చారు. కేరళలో రోడ్లు, వంతెనలు, మెడికల్ కాలేజీల పరిస్థితి దారుణంగా ఉందని, గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయన్నారు. కేరళలో మునబం వంటి సంఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని అక్కడ వందలాది హిందూ, క్రైస్తవ కుటుంబాలను బెదిరించారని ఆరోపించారు.
ఈశాన్య రాష్ట్రాలే ఉదాహరణ
బాధితులకు సహాయం చేయడానికి బదులుగా కేరళ ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు మద్దతుగా నిలుస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కానీ, కేరళలోని దేశభక్తి కలిగిన ప్రజలు దీనిని ఎప్పటికీ జరగనివ్వరని పేర్కొన్నారు. అలాగే మునంబంలోని 404 ఎకరాల భూమి తమదేనంటూ వఖ్ఫ్ బోర్డు చేస్తున్న వాదనల వల్ల దాదాపు 600 కుటుంబాలు (మెజారిటీ క్రైస్తవులు) నిరాశ్రయులయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. క్రైస్తవులు అధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లోని ఏడు రాష్ట్రాల్లో ఎన్డీయే (NDA)నే అధికారంలో ఉందని తెలిపారు. గత 50-60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాము అక్కడ చేసి చూపించామని మోడీ తెలిపారు. గోవాలో క్రైస్తవ సమాజం నిర్ణయాత్మక శక్తిగా ఉందని అక్కడ కూడా ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Also Read: Khanapur Municipality: కౌన్సిల్ హాల్‌లో ఉద్రిక్తత.. ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

