Thursday, March 12, 2026
Homeనేషనల్MLA Rahul Mamkootathil: అత్యాచారం కేసులో ఎమ్మెల్యేకి ఊరట.. ముందస్తు బెయిల్‌ మంజూరు

MLA Rahul Mamkootathil: అత్యాచారం కేసులో ఎమ్మెల్యేకి ఊరట.. ముందస్తు బెయిల్‌ మంజూరు

MLA Rahul Mamkootathil Bail: అత్యాచారం, బలవంతపు గర్భస్రావం కేసులో కేరళ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్‌కూటథిల్‌కు ఉపశమనం లభించింది. కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాకుండా దర్యాప్తు పూర్తయ్యేవరకు రాష్ట్రం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయనపై మూడు కేసులు నమోదు కాగా.. అన్ని కేసుల్లోనూ అరెస్ట్‌ నుంచి ఊరట పొందారు.   

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ys-sharmila-alleges-even-jagan-is-not-opposing-vb-g-ram-g-scheme/

అత్యాచారం, బలవంతపు గర్భస్రావం కేసులో పాలక్కాడ్ ఎమ్మెల్యే, బహిష్కృత కాంగ్రెస్ నేత రాహుల్ మమ్‌కూటథిల్‌కు కేరళ హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తుకు కచ్చితంగా సహకరించాలని ఆయనను ఆదేశించింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. 

ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని, తన మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం అప్పగించాలని మమ్‌కూటథిల్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వరుసగా మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఆయన తన పాస్‌పోర్ట్‌, మొబైల్ ఫోన్‌ను దర్యాప్తు అధికారులకు అప్పగించాలి. ప్రతి రెండో శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాల్సి ఉంటుంది. బాధితురాలిని లేదా సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదు.

Also Read: https://teluguprabha.net/international-news/seattle-agrees-29-million-dollar-settlement-in-jahnavi-case/

2025 నవంబర్‌లో ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు.. అత్యాచారం, అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడం, దాడికి పాల్పడటం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం వంటి పలు ఆరోపణలతో ఎమ్మెల్యే రాహుల్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించగా, ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికే మిగిలిన రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించగా.. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ లభించినట్లయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News