Kerala, Puducherry, Assam Elections: కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో ఎక్కడిక్కడ మైకులు మూగబోయాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం 48 గంటల నిశ్శబ్ద కాలాన్ని అమలులోకి తెచ్చింది. ఎన్నికల ప్రచార పర్వంలో మేనిఫెస్టోలతో LDF, UDF, బీజేపీ పోటాపోటీ హమీలు కురిపించాయి. ఈ రోజు చివరి రోజు కావడంతో ప్రచార జోరు మరింతగా పెంచాయి. భారీ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించి ఓటర్ల మద్దతు కోసం శ్రమించాయి.
కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా అన్ని స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు, అస్సాంలో 126 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న మూడు రాష్ట్రాలకు జరుగుతుండగా, ఏప్రిల్ 23న తమిళనాడులో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పశ్చిమబెంగాల్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. మొదటి విడత ఏప్రిల్ 23న, రెండో విడత ఏప్రిల్ 29న జరుగుతుంది. కానీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న వెలువడనున్నాయి.

