HomeTop StoriesKhushboo Meets Modi: ప్రధాని మోదీని కలిసిన సినీ నటి ఖుష్బూ.. ఎందుకో తెలుసా?

Khushboo Meets Modi: ప్రధాని మోదీని కలిసిన సినీ నటి ఖుష్బూ.. ఎందుకో తెలుసా?

Khushboo couple invites Modi to daughter wedding: తమిళనాడుకు చెందిన ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తమ కుమార్తె అవంతిక వివాహానికి ఆహ్వానిస్తూ.. ఖుష్బూ, సుందర్‌ దంపతులు శుభలేఖను అందజేశారు. వారితో పాటు కుమార్తె అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్‌ శ్రీనివాసన్‌ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. ‘‘బిజీ షెడ్యూల్‌లోనూ ప్రధాని మోదీ మాకు టైం కేటాయించినందుకు కృతజ్ఞుతలు తెలియజేస్తున్నాం. కాబోయే దంపతులను ఆయన ఆశీర్వదించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ మోదీజీ’’ అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘ఆరంభం’ అనే చిత్రంలో ఆమె లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇక, ఖుష్బూ సుందర్‌ దంపతుల పెద్ద కుమార్తె ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వివాహ వేడుకకు హాజరవ్వాలని ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించారు.

- Advertisement -

Also read: Hydra team: హైడ్రా టీమ్‌లో 16 మంది ట్రాన్స్‌జెండర్లు.. ‘ఈగిల్ టీమ్’ పేరిట విధులు.. సత్పలితాలిస్తోన్న ప్రభుత్వ చొరవ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News