Thursday, April 3, 2025
Homeనేషనల్Waqf Bill: యూపీఏ హయాంలోనూ వక్ఫ్ బిల్లుపై సవరణలు జరిగాయి: రిజిజు

Waqf Bill: యూపీఏ హయాంలోనూ వక్ఫ్ బిల్లుపై సవరణలు జరిగాయి: రిజిజు

కేంద్రప్రభుత్వం వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు(Waqf Amendment Bill)ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ ‌రిజిజు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. 1954లో తొలిసారి వక్ఫ్‌ చట్టం అమల్లోకి వచ్చిందని.. అప్పుడు అప్రజాస్వామికం అని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. యూపీఏ హయాంలోనూ వక్ఫ్ చట్టంలో సవరణలు జరిగాయని గుర్తుచేశారు.

- Advertisement -

అది మిగతా చట్టాలపై ప్రభావం చూపిందని.. అందుకే మళ్లీ సవరణలు చేయాల్సి వచ్చిందన్నారు. చట్టంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంటే ఎందుకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తిగా చెబుతారని వివరించారు. ఓవైపు రిజిజు ప్రసంగం కొనసాగుతుండగానే.. మరోవైపు విపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

కాగా ఈ బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చించనున్నారు. అనంతరం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. సభలో ఎన్డీయేకు మెజార్టీ ఉండటంతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందనుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు ఎంపీలందరూ తప్పకుండా పార్లమెంట్‌కు హాజరుకావాలని ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News