Friday, September 20, 2024
Homeనేషనల్Kolkata: రొట్టె వ‌ద్దు.. గుడ్డు కావాలి: నిందితుడు సంజయ్ రాయ్

Kolkata: రొట్టె వ‌ద్దు.. గుడ్డు కావాలి: నిందితుడు సంజయ్ రాయ్

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో కస్టడీలో ఉన్నాడు. జైలులో అత‌నికి పెడుతున్న రొట్టె, కూర‌ల‌ను తినడానికి నిరాకరిస్తూ, త‌న‌కు గుడ్డు, చౌమీను కావాల‌ని డిమాండ్ చేస్తున్న‌డ‌ని తెలుస్తోంది. వార్తా సంస్థ నివేదికల ప్రకారం జైలులో వడ్డింస్తున్న ఆహారం తినేందుకు అత‌ను నిరాక‌రిస్తున్నాడు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలందరికీ ఇచ్చే ఆహారాన్నే ఏ ఖైదీకైనా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఇంటి నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి అనుమతి ఉంటుంది.

- Advertisement -

గతంలో సీబీఐ కస్టడీ నుంచి కరెక్షనల్ హోమ్‌కు త‌ర‌లించిన‌ప్పుడు సంజయ్ రాయ్ తాను నిద్రించడానికి అదనపు సమయం కోరాడు. అలాగే తనలో తాను మాట్లాడుకోవడం కూడా అధికారుల‌కు కనిపించింది. కొన్ని రోజుల తర్వాత అతను తన సాధారణ స్థితికి చేరుకున్నాడు. కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు కోల్‌కతా పోలీసుల పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ని మాత్ర‌మే అరెస్టు చేశారు. సంజ‌య్ రాయ్ అత్యాచారం, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ విచారిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వరుసగా 14వ రోజు కేసు దర్యాప్తుకు సంబంధించి సందీప్ ఘోష్‌ను విచారించింది. ఘోష్‌ను ఏజెన్సీ ఇప్పటికే 140 గంటలకు పైగా విచారించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News