Saturday, February 22, 2025
Homeనేషనల్Kumbh Mela: కుంభమేళాలో స్నానం చేస్తే వ్యాధులు రావా.. ఆ నీరు మంచిదేనా.?

Kumbh Mela: కుంభమేళాలో స్నానం చేస్తే వ్యాధులు రావా.. ఆ నీరు మంచిదేనా.?

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్లకు పైగా ప్రజలు పవిత్ర స్నానాలు చేశారని ప్రభుత్వం చెబుతోంది. ఇత దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్నానాలు చేయడానికి ప్రయాగరాజ్ కు వెళ్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలా ఉంటే కుంభమేళాలోని స్నానం చేయడం పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఈ స్నానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇవి పవిత్ర స్నానాలు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

కుంభమేళాకు వచ్చే అఘోరాలు.. సంవత్సరాల తరబడి స్నానం చేయరని.. వారికి అనేక రకాల చర్మ వ్యాధులు ఉండే అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు. ఇలా చేస్తే చర్మ వ్యాధులు రావా..? నీరు కాలుష్యం అవదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే హిందువులు మాత్రం ఈ వాదనను కొట్టి పడేస్తున్నారు. పవిత్రస్నానం అనేదానిని రెండు కోణాల్లో చూడాలని చెబుతున్నారు. నిజానికి త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే దాన్ని పవిత్ర స్నానం అని పిలవడానికి బలమైన కారణం ఉంది. పవిత్రం అంటే శరీరం శుభ్రం అవడమే కాదు.. మనసు కూడా శుభ్రం అవడం.

కుంభమేళాలో స్నానం ఎందుకు పవిత్రమైనది: కేవలం స్నానం చేయడానికి.. శరీరం శుభ్రం చేసుకోవడానికి కుంభమేళాకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు పండితులు. ఇంట్లో స్నానం చేస్తే సరిపోతుందని, ఎలాంటి భయాలు ఉండవని అంటున్నారు. కానీ కుంభమేళాకి వెళ్లేవారు అనేక ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకుంటూ వెళ్తారు.. దైవ అనుభూతిని పొందుతారు.. జీవితానికి నిజమైన అర్థం తెలుసుకుంటారు. అక్కడికి వెళ్లి గంగలో మునగడం ద్వారా.. తాము పరిశుద్ధులం అవుతున్నాం అనే భావనతో ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇలా పవిత్ర స్నానం చేయడం వల్ల.. మనసు, ఆత్మ అన్నీ పరిశుద్ధమై.. ఇకపై పాపాలు చేయకూడదన్న భావనకు వస్తారని చెబుతున్నారు. అందుకే కుంభమేళాలో స్నానం పవిత్రమైనదిగా భావిస్తారని పండితులు అంటున్నారు.

సైంటిఫిక్ రీజన్: సైంటిఫిక్ గా చూస్తే.. మన దేశంలో చాలా నదులు కాలుష్యంతోనే ఉన్నాయి. గంగానదికి మాత్రం రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. గంగానది నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చేస్తుంది. దీనికి తోడు.. ఆ నదిలో బ్యాక్టీరియోఫాగెస్ (Bacteriophages) అనే మంచి వైరస్ ఉంది. ఇది మనుషులకు హాని చేసే బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియా గంగానదిలో ఉంది అని సైంటిఫిక్‌గా తేలింది. గంగానదిలో కూడా పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వ్యర్థాలు కలుస్తున్నాయి. అయినప్పటికీ ఈ వైరస్ వల్ల గంగానది నిరంతరం కాలుష్యం లేకుండా మారిపోతోందనీ, స్వయంగా క్లీన్ అవుతోందని పరిశోధనల్లో తేల్చారు.

ఏది ఏమైనా కోట్లాది మంది ఈ కుంభమేళాకు వస్తుంటారు. వారంతా పవిత్ర స్నానాలు చేస్తుంటారు. ఆ సమయంలో వ్యర్థాలు, ఎండిపోయిన పువ్వులు, ఆకులు నదిలో పడేస్తుంటారు. ముఖ్యంగా పరిశరాలను అపరిశుభ్రం చేస్తుంటారు. ఇలాంటివి జరగకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా జరిగితే నీరు కొంత కాలుష్యం అవుతుంది. వీటికి తోడు అక్కడే వంటలు వండుకుంటున్నారు, అక్కడే బట్టలు ఉతుకుతున్నారు. ఇలా ప్రభుత్వం చేయవద్దు అని చెప్పిన కొన్ని పనులు కూడా అక్కడ భక్తులు చేస్తున్నారు. దీని వల్ల నీటి పరిశుభ్రతకు సమస్య వస్తోంది. అందుకే తగినంత జాగ్రత్త తీసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News