Food Poison in Delhi Kuttu Atta: దేశ రాజధాని ఢిల్లీలో ఫుడ్ పాయిజన్ కారణంగా 200 మంది అస్వస్థతకు గురయ్యారు. కుట్టు అట్ట తిని అస్వస్థతకు గురి కావడంతో వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో అల్లాడిపోయారు. బాధితులను వెంటనే బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. బాధితులు జహంగీర్ పూర్, మహేంద్రా పార్క్, సమయ్‌పూర్, భల్స్వా డైరీ, లాల్ బాగ్, స్వరూప్ నగర్, వాయువ్య ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు.
Also Read: https://teluguprabha.net/crime-news/two-pepoles-died-as-rice-mill-wall-collapses-in-nizamabad/
ఢిల్లీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆహార శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. కుట్టు అట్ట ఫుడ్ పాయిజన్ కావడానికి కారణమేంటనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఫుడ్ పాయిజన్ జరిగిన ప్రాంతాల్లో కుట్టు అట్ట విక్రయాలను, వినియోగాన్ని ఆపేయాలని విక్రేతలకు, దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికారులు సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
బక్‌వీట్ గింజలతో తయారుచేసే కుట్టు అట్టా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఖనిజాలు, పుష్కలంగా ఉంటాయి. హిందూ పండుగలు ముఖ్యంగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో కుట్టు అట్ట పిండితో నైవేద్యం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. దేవీ నవరాత్రుల సమయంలో 200 మంది అస్వస్థతకు గురైన విషాదకర సంఘటన చోటుచేసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.


