Lakshmi Menon : కొచ్చిలో జరిగిన ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నటి లక్ష్మీ మేనన్‌కు కేరళ కోర్టు నుంచి ఊరట లభించింది. సెప్టెంబర్ 17 వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు, అప్పటి వరకు ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశించింది. ఈ కేసులో లక్ష్మీ మేనన్‌తో పాటు ఆమె స్నేహితులపై ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ALSO READ: Ysrcp : జగన్‌కు సొంత ఎమ్మెల్సీ షాక్..ఏకంగా హైకోర్టులోనే పిటిషన్
కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ బార్ వద్ద లక్ష్మీ మేనన్ బృందం, ఐటీ ఉద్యోగి బృందం మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ అక్కడితో సమసిపోకపోవడంతో, నటి బృందం ఆ ఉద్యోగిని వెంబడించి, అతడి కారును అడ్డగించారు. బలవంతంగా తమ కారులోకి ఎక్కించి, దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే, లక్ష్మీ మేనన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె పేరు ఇంకా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని సమాచారం.
లక్ష్మీ మేనన్ తెలుగు సినిమాల్లో ‘గజరాజు’, ‘ఇంద్రుడు’, ‘చంద్రముఖి 2’, ‘శబ్దం’ వంటి డబ్బింగ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఘటన ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 17 తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది


