Uttar Pradesh: ఇటీవల గ్రేటర్ నోయిడా ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ అసాధారణ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 20 ఏళ్ల యువకుడు దీపక్, తాను ఊహించనంత పెద్ద మొత్తాన్ని తన తల్లి ఖాతాలో చూసి ఒక్కసారిగా ఆశ్యర్యానికి గురయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మారిపోయిన అనుభూతికి లోనయ్యాడు.
దీపక్ తల్లి గాయత్రీ దేవి రెండు నెలల క్రితం మరణించారు. ఆమె బ్యాంకు ఖాతా ఇప్పటికీ యథాతథంగా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం దీపక్ తన తల్లి ఖాతాలో ఒక్కసారిగా ₹1,13,56,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,299 జమ అయ్యిందని నోటిఫికేషన్ వచ్చింది. ఇది దాదాపు 1.13 లక్షల కోట్ల కోట్లు! ఇది సాధారణంగా బ్యాంకు లావాదేవీల్లో కనిపించే సంఖ్య కాదు. ఈ సంఘటన మొత్తం ఇంటర్నెట్‌ను షాక్‌కు గురి చేసింది.
Read more: https://teluguprabha.net/national-news/pm-modi-nda-meeting-operation-sindoor-opposition/
ఈ మెసేజ్ చూసిన వెంటనే దీపక్ బ్యాంకుకు వెళ్లాడు. ఈ సంఘటన కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. అతను బ్రాంచ్ మేనేజర్‌కి విషయాన్ని తెలియజేయడంతో, అధికారులూ కూడా షాక్‌కు గురయి నమ్మలేకపోయారు. వెంటనే ఆ ఖాతాను తాత్కాలికంగా ఫ్రీజ్ చేశారు. ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఒకవేళ ఇది సాంకేతిక లోపం కాకపోతే.. హవాలా, మనీ లాండరింగ్ వంటి కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
Read more: https://teluguprabha.net/national-news/uttarkashi-flash-floods-tragedy/
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వార్తల్లో చెప్పిన విధంగా మా బ్యాంకు సిస్టమ్స్ లో ఎటువంటి లోపం లేదు. దీనిపై ప్రచారం అవుతున్న వార్తలు వాస్తవం కావు అని బ్యాంక్ అధికారులు స్పష్టం చేసారు. అలాగే సామజిక మాధ్యమంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ఘటనపై స్పందిస్తున్నారు.


