భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేడ్కర్(BR Ambedkar) 135వ జయంతి వేడుకలు పార్లమెంట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, పియూష్ గోయల్, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, ఇతర ప్రముఖ నాయకులు అంబేద్కర్‌కి నివాళులు అర్పించారు.