Wednesday, May 7, 2025
Homeనేషనల్LOC: పాక్‌ కాల్పుల్లో పది మంది భారత పౌరులు మృతి

LOC: పాక్‌ కాల్పుల్లో పది మంది భారత పౌరులు మృతి

గత కొద్ది రోజులుగా భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని నియంత్రణ రేఖ (LOC) వెంట పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్‌ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) పేరుతో మెరుపు దాడులు చేపట్టిన విషయం విధితమే. ఈ దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ క్రమంలో పాక్‌ రేంజర్లు రెచ్చిపోయారు. సరిహద్దు వెంబడి భారత గ్రామాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పది మంది భారతీయులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. అయితే ఈ కవ్వింపు చర్యలకు తప్పనిసరగా బదులు తీర్చుకుంటామని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News