Homeనేషనల్Valentine's Day : 'వాలెంటైన్స్ డే' ఎఫెక్ట్ ..175 శాతం పెరిగిన హోటల్...

Valentine’s Day : ‘వాలెంటైన్స్ డే’ ఎఫెక్ట్ ..175 శాతం పెరిగిన హోటల్ బుకింగ్స్

Hotel Bookings : ప్రేమకు భాష అవసరం లేదు కానీ, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక అందమైన ప్రదేశం, ఏకాంతం కచ్చితంగా కావాలి. అందుకే ఈ ఏడాది ఫిబ్రవరి 14 ‘వాలెంటైన్స్ డే’ కోసం ప్రేమికులు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంకా ఆరు రోజుల సమయం ఉండగానే దేశవ్యాప్తంగా హోటల్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో పెరగడం చూస్తుంటే, ఈసారి లవర్స్ డే వేడుకలు న భూతో న భవిష్యతి అన్నట్టుగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ప్రముఖ హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ “క్లియర్‌ట్రిప్” వెల్లడించిన గణాంకాలు చూసి మార్కెట్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బుకింగ్స్ ఏకంగా 175 శాతం పెరిగాయని ఆ సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మంజరి సింఘాల్ తెలిపారు.

- Advertisement -

ప్రేమికులు ఈసారి కేవలం ఫిబ్రవరి 14న మాత్రమే గడపడానికి ఇష్టపడట్లేదు. వాలెంటైన్స్ డే సందర్భంగా రెండు మూడు రోజులు విహారయాత్రలకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనివల్ల రిసార్ట్స్ పోర్ట్‌ఫోలియోలో బుకింగ్స్ 58 శాతం నుండి 110 శాతం వరకు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం సమయాన్ని మాత్రమే కాదు, డబ్బును కూడా ఖర్చు చేయడానికి ప్రేమికులు ఏమాత్రం వెనకాడటం లేదు.

ప్రేమ పక్షులు ఎక్కడికి ఎగిరిపోతున్నాయి? ఈ ఏడాది అత్యధికంగా బుకింగ్స్ జరిగిన ప్రదేశాలు ఇవే.జిమ్ కార్బెట్, ముక్తేశ్వర్ వంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో బుకింగ్స్ 70 నుండి 80 శాతం పెరిగాయి.ఎప్పటిలాగే గోవా ప్రేమికుల మొదటి ఛాయిస్‌గా నిలిచింది. గౌహతికి 60 శాతం, శ్రీలంకలోని కొలంబోకు 64 శాతం ప్రయాణాలు పెరిగాయి. అంటే దేశ సరిహద్దులు దాటి మరీ ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

Whiskey : మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చే వార్త

 

ఒకప్పుడు కేవలం గిఫ్టులు, చాక్లెట్లతో సరిపెట్టుకునే వారు. కానీ ఇప్పుడు విహారయాత్రలకు వెళ్లడమే అసలైన సెలబ్రేషన్ అని భావిస్తున్నారు. ఈ ట్రెండ్ వల్ల అటు విమానయాన రంగం, ఇటు హోటల్ రంగం కాసుల వర్షంలో మునిగిపోతున్నాయి. మీరు కూడా మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే ప్లాన్ చేసుకున్నారా? ఇంకా చేయకపోతే మాత్రం త్వరపడండి, ఎందుకంటే హోటల్స్,ఫ్లైట్ బుకింగ్స్ ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డులు తగిలించేలా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News