Madhya Pradesh CM Mohan Yadav’s Son to Marry in Mass Wedding: సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పెళ్లి అంటేనే ఆకాశమంత పందిరి, భూదేవి అదిరిపోయేలా ఏర్పాట్లు, కోట్లాది రూపాయల ఖర్చు ఉండటం చూస్తుంటాం. ఇక ముఖ్యమంత్రి ఇంట్లో పెళ్లి అంటే ఆ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించారు. తన హోదాను పక్కనపెట్టి, సామాన్యుడిలా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ (Abhimanyu Yadav) వివాహాన్ని ప్రైవేట్‌గా, విలాసవంతంగా కాకుండా, ఉజ్జయినిలో జరుగుతున్న ఒక సామూహిక వివాహ వేడుకలో (Mass Wedding) జరిపిస్తున్నారు.
ALSO READ: Kiran Bedi: ఏసీ గదుల్లో ఉంటే కాలుష్యం కష్టాలేం తెలుస్తాయి? ఆఫీసుల్లో ప్యూరిఫైయర్లు పీకేయండి
21 జంటలతో పాటు..
ఉజ్జయిని నగర శివార్లలోని సన్వారా ఖేడిలో ఆదివారం ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో సీఎం కుమారుడు అభిమన్యు, వధువు ఇషితా యాదవ్‌తో పాటు మరో 21 జంటలు ఒక్కటవుతున్నాయి. అందరితో పాటే సమానంగా, ఎలాంటి ప్రత్యేకతా లేకుండా ఈ పెళ్లి జరగడం రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకుంది. కేవలం ఆడంబరాలకే పరిమితం కాకుండా, సమానత్వం, ఐకమత్యం అనే సందేశాన్ని ఈ పెళ్లి ద్వారా సీఎం చాటిచెప్పారు.
ఎద్దుల బండిపై ఊరేగింపు
ఈ పెళ్లిలో మరో ఆకర్షణీయమైన అంశం ఏంటంటే.. వధూవరుల ఎంట్రీ. నేటి కాలంలో ఖరీదైన కార్లలో లేదా హెలికాప్టర్లలో పెళ్లికి రావడం ట్రెండ్. కానీ అభిమన్యు, ఇషితా జంట మాత్రం మాల్వా ప్రాంత సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఎద్దుల బండిపై పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. మొత్తం 22 మంది పెళ్లికొడుకులు గుర్రాలపై, పెళ్లికూతుళ్లు అందంగా అలంకరించిన బండ్లలో ఊరేగింపుగా రావడం అక్కడి వాతావరణంలో పండుగ శోభను తెచ్చింది.
ALSO READ: AAP MLA: కేజ్రీవాల్ అందరినీ మోసం చేశారు.. బీజేపీలో చేరిన ఆప్ ఎమ్మెల్యే.. ఢిల్లీ పాలిటిక్స్‌లో హీట్!
సామాన్యులు, వీవీఐపీలు ఒక్కచోట..
ఈ సామూహిక వివాహానికి దాదాపు 25 వేల మంది అతిథులు హాజరవుతున్నారు. ఐదు పెద్ద డోమ్‌లు, 40×100 అడుగుల భారీ స్టేజ్, 22 జంటలకు వేర్వేరుగా మండపాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సామాన్య ప్రజలతో పాటు 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు (యోగి ఆదిత్యనాథ్, భజన్ లాల్ శర్మ తదితరులు), 8 మంది గవర్నర్లు, కేంద్ర మంత్రులు, బాబా రామ్‌దేవ్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత అథర్వ హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
శుక్రవారం నుంచే సీఎం నివాసంలో సంప్రదాయ పూజలతో పెళ్లి సందడి మొదలైంది. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా, పది మందికి సహాయపడేలా సామూహిక వివాహాలను ప్రోత్సహిస్తూ, సొంత కొడుకు పెళ్లిని కూడా అందులో భాగంగా చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ నిర్ణయం ద్వారా సీఎం మోహన్ యాదవ్ ఆడంబరపు పెళ్లిళ్లపై సమాజంలో ఉన్న ఆలోచనా ధోరణిని మార్చే ప్రయత్నం చేశారు.
ALSO READ: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు

