Friday, January 23, 2026
Homeనేషనల్Guard of Honour: రీసెర్చ్‌కి డెడ్‌బాడీ.. 72 ఏళ్ల మహిళా మృతదేహానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 'గౌరవ...

Guard of Honour: రీసెర్చ్‌కి డెడ్‌బాడీ.. 72 ఏళ్ల మహిళా మృతదేహానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ‘గౌరవ వందనం’!

MP Govt Guard of Honour: తన శరీరాన్ని రీసెర్చ్‌ కోసం దానం చేసిన 72 ఏళ్ల మహిళకు మరణానంతరం గౌరవ వందనాన్ని (Guard of Honour)ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అందించింది. వినితా ఖాందేకర్ అనే మహిళా బ్రెయిన్‌ సమస్యతో ప్రాణాలు కోల్పోయింది. ఖాందేకర్‌ చివరి కోరిక మేరకు ఆమె కుటుంబ సభ్యులు ‘ముస్కాన్ గ్రూప్’ అనే శరీర, అవయవదానాలు చేసే ఎన్‌జీవోకు బాడీని అందించారు. చట్టపరమైన చర్యల అనంతరం ఆమె కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేసింది.

- Advertisement -

అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు తెలిపిన ప్రకారం, మరణానంతరం తమ శరీరాలు లేదా అవయవాలు దానం చేసే వ్యక్తులకు ప్రభుత్వం గౌరవ సూచికంగా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇస్తుందన్నారు. అందులో భాగంగానే వినితాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ గౌరవం అందించాలని నిర్ణయించింది.

ఈ ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ సమయంలో యూనిఫార్మ్‌లో ఉన్న పోలీసులు లేదా సైనికులు గన్‌లతో నిలబడి గార్డ్‌కు నాయకత్వం వహించే అధికారి ఆదేశం ప్రకారం, స్క్వాడ్ సభ్యులు ఆయుధాలను సల్యూట్ స్థితికి ఎత్తి, గౌరవ సూచకంగా నమస్కారం చేస్తారు. ఈ ప్రక్రియ కేవలం ప్రముఖులు, విధుల్లో అమరులైన పోలీసులకు, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా వారికి గౌరవార్థం ప్రభుత్వం కల్పిస్తుంది.

అవయదానంపై పెరిగిన అవగాహన: గతంలో మాదిరిగా కాకుండా గత కొన్ని రోజులుగా అవయదానం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బ్రెయిన్‌ డెడ్‌, ఇతర వ్యాధులతో బాధపడే వారి కుటుంబ సభ్యులు ఈ అవయదానానికి ముందుకు వస్తున్నారు. సమాజంలో ఈ ప్రక్రియ రోజు రోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్‌జీవోలు ఈ ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో పాటు అవయదానంపై పాజిటీవిటీని వివరిస్తున్నారు.

కొన్ని ప్రముఖ కుటుంబాలు అవయదానం చేయడానికి ముందుకు రావడంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలె సీతారం ఏచూరి కుటుంబం, సురవరం సుధాకర్‌ రెడ్డి కుటుంబాలు డెడ్‌ బాడీలను మెడికల్‌ కాలేజీకి అందించింది. నవంబర్‌ 11న ఓ వ్యవసాయాధికారి బాడీని కుటుంబ సభ్యులు రీసెర్చ్‌ కోసం గాంధీ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. రాజకీయ ప్రముఖుల కుటుంబాలు ముందుకు రావడం ఇతరలకు ప్రోత్సాహించినట్లే అవుతుంది.

నోట్‌: PTI నుంచి ఈ కంటెంట్‌ని సేకరించాం. దీనిపై తెలుగుప్రభతో ఎటువంటి సంబంధం లేదు గమనించగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News