మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి ఆదివారం నాడు చేరికలు కొనసాగాయి. బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్రానికి చెందిన ‘భూమి పుత్ర సంఘటన’ బిఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. సంఘటన సంస్థాపక అధ్యక్షుడు సంతోష్ వాడేకర్ తో పాటు సంఘం నేతలు..కిరణ్ వాబాలే, అవినాశ్ దేశ్ ముఖ్, అశోక్ అందాలే, రాజన్ రోక్డే, అసిఫ్ బాయి షేక్ తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు.
కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సమాధాన్ అర్నికొండ, ఆప్ పార్టీకి చెందిన దీపక్ కొంపెల్వార్, యోగితా కొంపెల్వార్ రాము చౌహాన్, భారీ త్రిలోక్ జైన్, సంతోష్ కాంబ్లె, అఖిల్ భారతీయ క్రాంతి దళ్ సంఘటనకు చెందిన లక్ష్మికాంత్ భంగే,తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
గణేశ్ కదమ్, సంతోష్ గౌర్ ఆధ్వర్యంలో…గంగాధర్ మహారాజ్ కురుంద్కర్, గణేశ్ మహారాజ్ జాదవ్, అనంత్ మహారాజ్ బార్వే, హరిబావు మహరాజ్ , సంజీవ్ మహారాజ్, రాజ్ కుమార్ మహారాజ్, శివాజీ మహరాజ్, ఉమాకాంత్ మహారాజ్, నకీఫ్ నాథ్ మహారాజ్, వినాయక్ మహారాజ్, సంతోష్ మహరాజ్,సురేశ్ మహారాజ్, పాండురంగ మహారాజ్, శ్రీకృష్ణ మహరాజ్, భగవాన్ శాస్త్రీ, బాటాసాహెబ్ మహరాజ్, గణపతి మహరాజ్, శివాజీ మహరాజ్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అదే సందర్భంలో నిఖిల్ దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో..గోండ్వానా పార్టీకి విదర్భ అధ్యక్షులు ప్రణీత వికేసీ, యావత్మాల్ కు చెందిన సామాజిక కార్యకర్త వర్ష కాంబ్లే పార్టీలో చేరారు. వీరందరికీ బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా .. విదర్భకు చెందిన మహిళా బచత్ గాట్ మహిళా కమిటి అధ్యక్షురాలు కల్పన, పూనమ్ అలోర్ తదితరులు బిఆర్ ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు మాణిక్ కదమ్ లున్నారు.
Maharashtra BRS: భూమి పుత్ర సంఘటన్ BRS లో విలీనం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES