Saturday, November 23, 2024
Homeనేషనల్Maharashtra: కాందార్ లోహ సభకు ఏర్పాట్లు

Maharashtra: కాందార్ లోహ సభకు ఏర్పాట్లు

మహారాష్ట్ర లోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాందార్ లోహ సభ సక్సెస్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు కాందార్ లోహలోనే మకాం వేసి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భారీ జనసమీకరణ చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న తెలంగాణ మోడల్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టడం ద్వారా కాందార్ లోహ సభకు భారీ జన సమీకరణ చేయాలనే లక్ష్యంతో పలు గ్రామాలకు 20 ప్రచార రథాలు, 10 ఎల్ ఈడీ వీడియో స్ర్కీన్ వాహనాలను సోమవారం జీవన్ రెడ్డి ప్రారంభించారు.

- Advertisement -

కాందార్ లోహా సభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మోడల్ గురించి మహారాష్ట్ర ప్రజలకు పూస గుచ్చినట్టు వివరిస్తారని ఆయన చెప్పారు. బీఆర్ ఎస్ కాందార్ లోహా సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పే గొప్ప చరిత్ర గా మిగిలిపోతుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, ప్రవీణ్ పవాడీ, అంకిత్ యాదవ్ స్తానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మోడల్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కోసం మహారాష్ట్ర లోని గ్రామాలకు 20 ప్రచార రథాలు, 10 ఎల్ ఈడీ వీడియో స్ర్కీన్ వాహనాలను ప్రారంభించారు. వీటిని రాష్ట్రంలో విస్తృతంగా తిప్పనున్నట్టు బీఆర్ఎస్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News