మావన్నీ అభివృద్ధి స్కీములని, బీజేపీవి అన్నీ స్కాములంటూ పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘనమైన తెలంగాణ మోడల్ హిందూస్థాన్ లో అమలు కావాలా?..వద్దా? అని ప్రశ్నించారు. ప్రతీ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించాలా?..వద్దా? అని అడిగారు.
మహారాష్ట్ర రాజాకీయాల్లో బలమైన శక్తిగా బీఆర్ ఎస్ ఆవిర్భవించిందన్నారు. మార్చి26 సభా వేదికపై కేసీఆర్ గారి సమక్షంలో భారీ చేరికలు ఉంటాయన్నారు. కాందార్ లోహ సభ సూపర్ సక్సెస్ కావడం ఖాయమన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ తో పాటు మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోండ్గే ,డాక్టర్ యశ్పాల్ భింగే ,సురేష్ గైక్వాడ్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి , నాగనాథ్ గీసెవాడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.