Wednesday, April 2, 2025
Homeనేషనల్Kumbh Mela: కుంభమేళాలో స్నానం చేస్తే విముక్తి రాదు.. అమిత్ షాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

Kumbh Mela: కుంభమేళాలో స్నానం చేస్తే విముక్తి రాదు.. అమిత్ షాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

మహా కుంభమేళా(Kumbh Mela)లో స్నానాలు చేస్తే విముక్తి రాదంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge)మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) క్షమించరాని తప్పులు చేశారన్నారు. అలాంటి వ్యక్తులు కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి ఎలా వస్తుందని ప్రశ్నించారు. కచ్చితంగా మోడీ, షా నరకానికి వెళ్తారంటూ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని మోడీ విర్రవీగారని.. తీరా చూస్తే పొత్తు లేకపోతే దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మోడీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతుల్లో ఉందన్నారు.

- Advertisement -

కాగా సోమవారం ఉదయం అమిత్ షా కుటుంబసభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షాకు సాధువులు తిలకం దిద్దారు. అనంతరం ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అర్చన చేసి గంగా హారతి ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోడీ రాబోతున్నారు. ఫిబ్రవరి 1న రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, సహా 73 దేశాల దౌత్యవేత్తలు సైతం కుంభమేళాకు రానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News