Mamata Banerjee Cheers For “Women In Blue” BJP Hits Back: భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అద్భుత విజయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘వుమెన్ ఇన్ బ్లూ’ జట్టును పొగడ్తలతో ముంచెత్తారు. కానీ, ఆమె అభినందనల పోస్ట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రమైన వ్యంగ్యాస్త్రం సంధించింది. గతంలో ఓ సామూహిక అత్యాచారం కేసులో మమత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ బీజేపీ వేసిన సెటైర్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు, దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. దీనిపై మమతా బెనర్జీ ‘X’ (ట్విట్టర్) లో స్పందిస్తూ, “దేశం మొత్తం ‘వుమెన్ ఇన్ బ్లూ’ని చూసి గర్వపడుతోంది. టోర్నమెంట్ అంతటా వారు ప్రదర్శించిన పోరాటపటిమ, నైపుణ్యం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. మీరు మా హీరోలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి,” అని పోస్ట్ చేశారు.
OMG they were playing till 12❗️
But you had told them to be home by 8‼️#Raat8Ta #WomensWorldCup2025 https://t.co/OQ9bReYVmv
— BJP West Bengal (@BJP4Bengal) November 2, 2025
దీనికి బీజేపీ బెంగాల్ విభాగం వెంటనే స్పందించింది. మమత గత వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ, “ఓ మై గాడ్! వాళ్ళు (మహిళా క్రికెటర్లు) రాత్రి 12 గంటల వరకు ఆడారు! కానీ మీరేమో వాళ్ళను రాత్రి 8 గంటలకల్లా ఇంట్లో ఉండమన్నారు కదా,” అంటూ చురక అంటించింది.
బీజేపీ కౌంటర్‌కు కారణం ఇదే..
గత నెలలో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని (23)పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనపై స్పందించిన మమతా బెనర్జీ, బాధితురాలినే తప్పుపట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఆమె ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అసలు రాత్రి 12:30 గంటలకు ఆమె క్యాంపస్ నుండి బయటకు ఎలా వచ్చింది? వారిని (విద్యార్థులను) అలా అనుమతించకూడదు. అదొక అటవీ ప్రాంతం. వాళ్లను వాళ్లే రక్షించుకోవాలి,” అంటూ వ్యాఖ్యానించారు.
ALSO READ: Girl’s Body Found: ఆ బాలిక మృతదేహం లభ్యం.. గొంతు కోసి, అవయవాలు విరిచి, ముక్కులో ఇసుక, గ్లూ!
మమత వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. లైంగిక దాడుల కేసుల్లో న్యాయం చేయాల్సింది పోయి, ముఖ్యమంత్రే “బాధితురాలినే నిందిస్తున్నారని” (victim blaming) బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. సందేశ్‌ఖాలీ, పార్క్ స్ట్రీట్ ఘటనల నుండి ఇప్పటివరకు మమత నిందితులనే రక్షిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధులు ఆరోపించారు.
ఇప్పుడు, మహిళా క్రికెటర్లు రాత్రి ఆలస్యంగా మ్యాచ్ గెలిచిన సందర్భాన్ని వాడుకుంటూ, బీజేపీ.. మమత పాత వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తెచ్చి ఆమెను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.
ALSO READ: Blackmail: అమ్మాయిల నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. 2021లో బెయిల్‌పై తప్పించుకున్న నిందితుడి అరెస్ట్!


