Viral video : సాధారణంగా బైక్పై ఎంత మంది ప్రయాణిస్తారు? ఒకరు లేక ఇద్దరు..? ఎప్పుడో ఒక సారి ముగ్గురు ప్రయాణిస్తుండడాన్ని చూస్తూనే ఉంటాం. బైక్పై ఇద్దరికి కంటే ఒక్కరు ఎక్కువైనా సరే ఇరుకుగా ఉంటుంది. బండి నడిపే వారికి అసౌకర్యంగా ఉండడంతో పాటు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని ఎక్కించుకుని బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఆ వీడియోలో ఓవ్యక్తి బైక్ నడుపుతుండగా అతడి భార్యతో పాటు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరితో పాటు రెండు కుక్కలు, కోళ్లు కూడా ఉన్నాయి. పైగా ఒక్కరు కూడా హెల్మెట్ ధరించలేదు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2.5లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇంతమంది ఒక బైక్పై ప్రయాణించడం ప్రమాదమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంగా.. చిన్నారుల భద్రత అతడికి ఏ మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు.