Mother And Son: కన్నతల్లికి పట్టెడన్నం పెట్టడం కంటే జైలుకు వెళ్లడమే నయమనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. కోర్టు సీనియర్ సిటిజన్ల చట్టం కింద రక్షణ కోసం చెల్లించాలన్న డబ్బు చెల్లించకుండా జైలుకెళ్లాడు. ఈ ఘటన కేరళ మడికైలోని మలప్పచేరిలో జరిగింది. వడుతలకుజి ప్రాంతానికి చెందిన ప్రతీష్ (46) అనే వ్యక్తిని నీలేశ్వరం పోలీసులు అరెస్టు చేశారు. కంజిరపోయిల్‌కు చెందిన ఎలియమ్మ జోసెఫ్ (68) తన కొడుకు తనకు భరణం చెల్లించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో కన్హంగడ్ ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు.
Read Also: Acid Reflux: కడుపులో మంట సమస్య ఎలా తగ్గించుకోవాలంటే?
ఏడాది క్రితం ఆర్డీఓ కోర్టు ఏలియమ్య అనే వృద్ధురాలు కొడుకు తినడానికి తిండి కూడా పెట్టట్లేదని కోర్టుని ఆశ్రయించారు. సీనియర్ సిటిజన్ల చట్టం కింద రక్షణ కోసం వృద్ధురాలికి నెలకు రూ.2,000 చెల్లించాలని ఆమె కొడుకు ప్రతీష్‌ను కోర్టు ఆదేశించింది. కాగా.. ఐదు నెలల క్రితం ఏలియమ్య తన కుమారుడు భరణం చెల్లించడం లేదని ఆర్డీఓ కోర్టులోని మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసింది. బకాయిలతో సహా 10 రోజుల్లోపు ఆ మొత్తాన్ని చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు మడికై గ్రామ అధికారి ద్వారా ప్రతీష్ కు నోటీసు పంపింది. ఆ తర్వాత రెండుసార్లు ట్రిబ్యునల్ ముందు ప్రతీష్‌ను హాజరు పరచినా డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. జూలై 31లోపు ఆ మొత్తాన్ని చెల్లించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా ట్రిబ్యునల్ హెచ్చరించింది. ఈ మేరకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది కూడా. చివరకు విచారణ సమయంలో కూడా ఆదేశాలను ప్రతీష్ లెక్క చేయలేదు.
Read Also: Nepal: యువతకు హితవు పలికిన ఖాట్మండు మేయర్ బలేన్..!
జైలు శిక్ష..
దీంతో ఆర్డీఓ బిను జోసెఫ్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం మొత్తం చెల్లించే వరకు తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల రక్షణ సంక్షేమ చట్టంలోని 5(8) సెక్షన్ల కింద, CrPCలోని 144 సెక్షన్ల కింద జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. దీంతో నిందితుడు ప్రతీష్‌ను కన్హంగడ్ జిల్లా జైలుకు తరలించారు. ఆరు నెలల బకాయి రూ.12 వేలు మొత్తం తల్లికి చెల్లించేంత వరకు జైలులోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. పలు దఫాలుగా విచారణలు జరిగినా, బకాయిలు చెల్లించేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ప్రతీష్ చెల్లించడానికి తాను ఇష్టపడనని పదే పదే చెప్పడంతో మంగళవారం జరిగిన చివరి విచారణలో అతన్ని నీలేశ్వరం పోలీసులు అరెస్టు చేసి RDO కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడ కూడా డబ్బు చెల్లించడానికి తాను సిద్ధంగా లేనని ప్రకటించాడు. దీంతో, కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.


