Monday, November 25, 2024
Homeనేషనల్Manipur-Mumbai 6,200km: ఇది రాహుల్ భారత్ న్యాయ యాత్ర

Manipur-Mumbai 6,200km: ఇది రాహుల్ భారత్ న్యాయ యాత్ర

భారత్ జోడో యాత్ర 2.0 అనే ఈ యాత్ర ఈస్ట్ టు వెస్ట్ ఫేజ్ యాత్రన్నమాట

మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పేరుతో పర్యటించనున్నారు. వచ్చేనెల అంటే కొత్త సంవత్సరంలో జనవరి 14వ తేదీ నుంచి భారత్ న్యాయ యాత్ర ప్రారంభించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మార్చ్ 20వ తేదీన న్యాయ యాత్ర పూర్తయ్యేలా ప్రణాళిక సిద్దం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వివరించింది.

- Advertisement -

14 రాష్ట్రాలగుండా 85 జిల్లాల్లో సాగే  యాత్రను ఇంఫాల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభిస్తారు.  మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా ఈ యాత్ర సాగనుండటం హైలైట్.  యాత్రలో భాగంగా కొన్ని చోట్ల బస్సుల్లో మరికొన్ని చోట్ల పాదయాత్ర చేసేలా రాహుల్ యాత్రను పకడ్బందీగా రూపొందించటం మరో హైలైట్.  దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం ప్రధాన అంశంగా ఈ యాత్ర సాగనుంది.

గతేడాది కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు రాహుల్ పాదయాత్ర ద్వారా భారత్ జోడోయాత్రను 5 నెలలపాటు విజయవంతంగా పూర్తిచేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రను తలపెట్టడంపై బీజేపీ గట్టిగా సెటైర్లు వేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News