నిన్న రాత్రి మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలను నిర్వహించనుండగా తెలంగాణలో నేడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వృద్ధాప్య సమస్యలతో గత కొన్నేళ్లుగా ఆయన బాధపడుతున్నారు.
నిన్న మన్మోహన్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస వదిలినట్టు ఎయిమ్స్ వెల్లడించింది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేండ్లపాటు ప్రధానిగా సేవలందించారు. ఆయన తన హయంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. శ్రద్ధ, పనిపై అతడి విద్యా విధానం, నిరాడంబరమైన జీవితంతో గుర్తింపు పొందారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధిరేటు నమోదుకాగా.. పేదరికం తగ్గుముఖం పట్టింది.