సామాన్యులే అప్పులు చేసి పెద్ద ఇళ్లు కట్టుకునే మనదేశంలో ఓ ప్రధాని చాలా సాదాసీదాగా డబుల్ బెడ్రూం ఇంట్లో ఉండటం అంటే నమ్మదగ్గ విషయమేనా? లాలా బహదూర్ శాస్త్రి తరువాత అంత సింపుల్ గా ఉన్న ప్రధానిగా మన్మోహన్ సింగ్ కు పేరుంది. రాజ్యసభ సభ్యత్వానికి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే క్రమంలో ఆయన అస్సాంలోని గౌహతిలో ఓ డబుల్ బెడ్రూం ఇల్లు తీసుకుని అందులోనే కొంతకాలం ఉన్నారు. 1991లో ప్రధాని పీవీ నరసింహా రావు రాజ్యసభ ఎంపీగా మన్మోహన్ ను అస్సాం నుంచి ఎంపిక చేశారు. గౌహతిలోని నందన్ నగర్ లో ఆయన హౌస్ నంబర్ 3989లోనే 2019 వరకూ కొనసాగారు. ఈ చిన్న ఇల్లు ఆయనకు రెండో ఇల్లుగా మారిపోయి, ఈశాన్య రాష్ట్రాలు తనను అక్కున చేర్చుకునేలా ఇమేజ్ సంపాదించుకునేలా చేసింది. అప్పటి వరకు బయటి వ్యక్తి అని అన్నవాళ్లు సైతం మన్మోహన్ ఇల్లు చూసి షాక్ తిన్నారు. ఈ ఇల్లు అస్సాం కాంగ్రెస్ సీఎం హితేశ్వర్ సైకియాది కావటం మరో విశేషం. 1991 నుంచి ఈ ఇల్లే మన్మోహన్ అధికారిక చిరునామాగా రికార్డుల్లో నిలిచింది. ఇంతకీ ఈ డబుల్ బెడ్రూం ఇంటికి మన్మోహన్ ఇచ్చిన అద్దె ఎంతో తెలుసా అక్షరాలా 700 రూపాయలు మాత్రమే. ప్రతి నెలా కచ్ఛితంగా అద్దె చెల్లించి ఈ ఇంట్లో మన్మోహన్ ఉండేవారని హితేశ్వర్ సతీమణి హేమాప్రవా సైకియా వివరించారు. ప్రధాని హోదాలో ఉండి కూడా ఇంటికి అద్దె చెల్లించటంలో ఎన్నడూ క్రమం తప్పని ఆయన పంపిన చెక్ ను ఒకసారి తాము క్యాష్ చేసుకోకపోతే మళ్లీ కొత్త చెక్ పంపి, ఈసారి వెంటనే దాన్ని క్యాష్ చేసుకోమని ఆయన స్వయంగా సైకియా దంపతులకు ఫోన్ చేసి చెప్పటాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక మన్మోహన్ ఈ ఇల్లు ఖాళీ చేశాక ఆయన జ్ఞాపకంగా దాన్ని అలాగే తాళం వేసి ఉంచినట్టు ఆమె వెల్లడించటం విశేషం. హితేశ్వర్ మరణం తరువాత చాలామంది తమ లగ్జురీ బంగళాలను మన్మోహన్ కు అద్దెకిచ్చే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం చాలా సున్నితంగా ఈ ఇల్లే తనను అస్సాంకు దగ్గర చేసిందని చెబుతుండేవారని ఆమె తాజాగా వెల్లడించారు.
Manmohan Singh in double bedroom rental house: డబుల్ బెడ్రూం ఇంట్లో ఉండే మన్మోహన్!
లో ప్రొఫైల్లో..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES