ఝార్ఖంఢ్(Jharkhand)లోని బొకారో జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో(Encounter) మావోయిస్టు కీలకనేత హతమయ్యాడు. ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్, ఫుచన, నాగ మాంఝీ, కరన్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే రూ.కోటి రివార్డ్‌ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఎనిమిది మందిలో అరవింద్, రామ్ మాంఝీ అనే మావోయిస్టులు ఉన్నారు. వీరిపై కూడా రూ.10 లక్షలు చొప్పున రివార్డులు ఉన్నాయి.
సోమవారం తెల్లవారుజామున సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరికి లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. వీరిలో ప్రయాగ్ ఉన్నట్లు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు.