గెరిల్లా దాడులకోసం తెగబడేందుకు ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ అడవుల్లో భారీ రహస్య సొరంగ మార్గాన్ని నిర్మించుకున్న మావోల చర్య సడన్ గా వెలుగులోకి వచ్చింది. ఈ భారీ టన్నెల్ లో ఆయుధాలతో ఏకంగా వంద మంది సురక్షితంగా దాచుకునే అవగాశం ఉంది. ఈ భారీ సొరంగం ఏకంగా 130 అడుగులుండటం విశేషం. ఇది ఈ టన్నెల్ గోడలు చూస్తే ఇటీవలి కాలంలో నిర్మించినట్టు అర్థమవుతున్నట్టు భద్రతా సిబ్బంది చెబుతోంది. ఇంద్రావతి నది సమీపంలో ఈ టన్నెల్ ఉంది.
సెర్చ్ ఆపరేషన్ లో
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరి వేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హతమార్చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టుల సొరంగం బయటపడింది. తాళిపేరు నది సమీపంలో భారీ బంకర్‌ను గుర్తించాయి భద్రతా బలగాలు సొరంగంలో సకల వసతులు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు.
భారీ డంప్ స్వాధీనం
దేశవాళి రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండ్రీ మిషన్, పెద్ద ఎత్తున మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్, ఆయుధాలను గుర్తించారు. బాంబులను మావోయిస్టులు ఈ సొరంగం లోనే తయారు చేసుకుంటున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. తుమిరెల్లి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ భారీ సొరంగాన్ని గుర్తించారు. ఈ చర్యతో మావోయిస్టులకు కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పాలి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్నారు. ఒక్క జనవరి నెల లోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు చంపేశారు.